డైరక్టర్ శంకర్ నెక్ట్స్ చిత్రం ఖరారు
హైదరాబాద్ : దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్రానికి రంగం చేస్తున్నాడు. ఈ సారి తన హిట్ చిత్రం సీక్వెల్ ని స్క్రిప్టు సిద్దం చేసుకుంటున్నాడు. ఆ చిత్రం మరేదో కాదు...ఆయన సృష్టించిన సాంకేతిక మాయాజాలం 'రోబో'. ఈ చిత్రం సీక్వెల్ చేస్తే ఖచ్చితంగా మంచి అంచనాలు ఉంటాయనేది నిజం..అందుకే ఈ కథతో రెడీ అవుతున్నాడని చెన్నై వర్గాలు చెప్తున్నాయి.
రజనీకాంత్ నటించిన 'రోబో' చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకొంది. సాంకేతికంగా భారతీయ చిత్ర పరిశ్రమను మరో మెట్టు ఎక్కించింది. ఆ సినిమాకు కొనసాగింపుగా మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. 'రోబో 2' కోసం ఇప్పటికే కథ, కథనాల్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

'రోబో' సీక్వెల్ లోనూ రజనీకాంత్ హీరోగా నటిస్తారని తెలిసింది. ప్రస్తుతం శంకర్ 'ఐ' పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తూనే 'రోబో 2' కోసం సన్నాహాలు చేసుకొంటున్నట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











