రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. పుట్టినరోజు కానుకగా బిగ్ అప్డేట్!
రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సంచలన దర్శకుడు శంకర్ మొదటి సారి టాలీవుడ్ హీరోతో వర్క్ చేస్తుండడంతో ఇటు టాలీవుడ్ లోనే కాకుండా అటు కోలీవుడ్ లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే ఈ సినిమాకు సంబంధించిన గాసిప్స్ రోజుకోటి వైరల్ అవుతోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ ఒక స్పెషల్ ప్లాన్ వేసినట్లు సమాచారం. మార్చ్ 27న సినిమా కాన్సెప్ట్ తెలిసేలా మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు టాక్. ఇక జులై నెలలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దాదాపు 150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ స్టార్స్ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. సినిమో యూనివర్సల్ మెస్సేజ్ ఉంటుందని టాక్. ఇక తెలుగు టాప్ రైటర్ బుర్రా సాయి మాధవ్ ఈ సినిమాకు డైలాగ్స్ రాయనుండగా అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు టాక్ వస్తోంది. ఇక రామ్ చరణ్ అక్టోబర్ 13న RRR సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. శంకర్ సినిమాను ఎలాగైనా 2022లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ సెట్ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











