మరోసారి తెరపైకి 'మజిలీ' కాంబినేషన్.. ఒకేసారి సమంత, నాగచైతన్యలతో దర్శకుడి చర్చలు!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు బెస్ట్ కపుల్స్ గా మంచి గుర్తింపు అందుకున్న వారిలో సమంత నాగచైతన్య జోడి టాప్ లిస్టులో ఉండేది. ఇక పెళ్లి చేసుకున్న కొంతకాలం తర్వాత మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే సమంత నాగచైతన్య కాంబినేషన్లో అంతకు ముందు వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.
ముఖ్యంగా నాగచైతన్యకు మొదటి సక్సెస్ వచ్చింది సమంత మొదటి సినిమా ద్వారానే. ఏ మాయ చేసావే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకోవడమే కాకుండా నాగచైతన్య కెరియర్ కు కూడా మంచి ట్రాక్ సెట్ చేసింది. ఇక తర్వాత వీరి కలయికలో వచ్చిన మనం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన మజిలి సినిమా కూడా మరో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో నాగచైతన్య మార్కెట్ కూడా పెరిగిపోయింది. అయితే మళ్ళీ ఆ తర్వాత వీరు కలిసి నటించలేదు. విడాకుల తర్వాత ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు శివ నిర్మాణ ఊహించని విధంగా నాగచైతన్యత ఒక ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం శివ నిర్మాణ సమంతతో ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది.

ఇక ఆమెతో ఒకవైపు వర్క్ చేస్తూనే నాగచైతన్యతో కూడా వర్క్ చేసేందుకు శివ నిర్వణ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒక మంచి ఫ్యామిలీ మెలోడీ డ్రామా ఉండే విధంగా కథను రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఖుషి సినిమా షూటింగ్ మధ్యలో కాస్త గ్యాప్ రావడంతో శివానిర్వాణ నాగచైతన్యకు పూర్తిస్థాయిలో కథను చెప్పినట్లుగా తెలుస్తోంది. చైతన్యకు కూడా ఆ కథ బాగానే నచ్చిందట. మరోసారి ఈ విషయంపై చర్చలు జరిపి ఫైనల్ చేద్దాం అని కూడా సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి నాగచైతన్య సరసన ఏ హీరోయిన్ సెలెక్ట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











