మహర్షి కథ నాదే.. కాపీ కొట్టారు.. దిల్‌రాజుతో డైరెక్టర్ ఫైట్
మహర్షి సినిమా విడుదలై మంచి టాక్‌ను సంపాదించుకొన్నది. ఈ చిత్రం భారీ వసూళ్లను కూడా సాధిస్తున్నది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజుపై దర్శకుడు శ్రీవాస్ సంచలన ఆరోపణలు చేశాడు. కొన్నేళ్ల క్రితం ఈ కథను నిర్మాతకు చెప్పానని, మహర్షి సినిమా నా కథకు దగ్గరగా ఉందని ఆయన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. గతంలో రామ రామ కృష్ణ కృష్ణ అనే సినిమాను దిల్ రాజుతో శ్రీవాస్ రూపొందించిన సంగతి తెలిసిందే.
దిల్ రాజుతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా దర్శకుడు శ్రీవాస్ ఈ వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని చూస్తున్నట్టు జాతీయ వెబ్ సైట్ ఇండియా టుడే కథనంలో పేర్కొన్నది. శ్రీవాస్ చేసిన అభ్యంతరాలపై దిల్ రాజు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.

తన రాసుకొన్న కథనే మహర్షి రావడంపై దిల్ రాజును కలిసి వివరణ అడిగారు. కథకు సంబంధించిన పాయింట్ తనదేనని విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వచ్చినట్టు సమాచారం. వివాదాన్ని పెద్దగా చేయకుండా తనతో మరో సినిమాకు నిర్మాతగా రూపొందిస్తానని శ్రీవాస్‌కు హామీ ఇచ్చినట్టు కథనంలో పేర్కొన్నది. దాంతో శ్రీవాస్ సంతృప్తి చెందినట్టు కథనంలో పేర్కొన్నారు.
మహర్షి సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. మహేష్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట మంచి స్పందన రాబడుతున్నది. ఫ్యాన్స్ కూడా సానుకూలంగా స్పందించడంతో మంచి కలెక్షన్లను సాధిస్తున్నది.

గతంలో దిల్ రాజు నిర్మించిన మిస్టర్ ఫర్‌ఫెక్ట్ సినిమాను కాపీరైట్ వివాదం వెంటాడింది. ఇటీవల బాధితుడికి అనుకూలంగా కోర్టు తీర్పు వెల్లడించింది. చాలా కాలంగా మిస్టర్ ఫర్‌ఫెక్ట్ కోర్టు వివాదంలో నలిగిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











