SS Rajamouli : RRR తరహాలోనే జక్కన్న ప్లాన్.. మహేశ్​ను కంట్రోల్ చేసేందుకు కీలక నిర్ణయం!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే గుంటూరు కారం సినిమా పూర్తి చేసి తన తదుపరి సినిమా మీద దృష్టి పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఆయన అనేక కండిషన్స్ పెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబును కంట్రోల్ లో పెట్టేందుకు జక్కన్న కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఆ విషయంలోకి వెళ్తే...

ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు చేయాల్సిన సినిమా మీద దృష్టి పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు కెరియర్ లో 29వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి కథ ఇదే అంటూ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఇండియానా జోన్స్ తరహాలో ప్రపంచవ్యాప్తంగా అందరూ మెచ్చే విధంగా ఈ సినిమా తెరకెక్కిస్తామని ఆయన అనేక లీకలు ఇచ్చారు.

Director SS Rajamouli And Mahesh Babu To Conduct A Joint Press Meet Like RRR News Goes Viral

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రచారం అయితే తెరమీదకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించి అనేక ప్రచారాలు తెరమీదకు వస్తున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో ఎలా అయితే రాజమౌళి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి కొంత క్లారిటీ ఇచ్చారో ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలో కూడా అదే చేయబోతున్నారని తెలుస్తోంది.

నిర్మాత కేఎల్ నారాయణ, మహేష్ బాబు, రాజమౌళి ముగ్గురు కలిసి ఒక జాయింట్ ప్రెస్ మీట్ పెడతారని సినిమాకి సంబంధించిన కొన్ని వివరాలతో పాటు ప్రెస్ అడిగే ప్రశ్నలకు సైతం సమాధానాలు ఇస్తారని తెలుస్తోంది. ఇక ఈ ప్రెస్ మీట్ పూర్తయిన తర్వాత మహేష్ బాబు ఒక యాడ్ షూట్ లో పాల్గొనబోతున్నారని ప్రస్తుతానికి ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో మహేష్ బాబు సీక్రెసి మెయింటెన్ చేయాలని రాజమౌళి సూచనలు చేసినట్లుగా చెబుతున్నారు.

మరోవైపు ఈ సినిమా టీమ్ మొత్తం కన్ఫార్మ్ చేశారు. ఇక ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈలోపే మహేష్ తన ఫ్యామిలీ టూర్స్ కంప్లీట్ చేసుకుని రానున్నారని సమాచారం. ఇక మహేష్ బాబును బయట కనిపించకుండా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బాడీ ఫిట్నెస్ విషయంలో కొన్ని దేశాలకు వెళ్లి అక్కడి ట్రైనర్లతో వర్క్ షాప్ చేసి వచ్చిన మహేష్ బాబు పూర్తిస్థాయిలో బాడీని ట్యూన్ చేసే పనిలో పడబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

Director SS Rajamouli And Mahesh Babu To Conduct A Joint Press Meet Like RRR News Goes Viral

ఇక మహేష్ బాబు రెమ్యూనరేషన్ గురించి కూడా రకరకాల ప్రచారాలు అయితే తెరమీదకు వస్తున్నాయి. మహేష్ బాబుకు చెందిన జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా సినిమాలో సహనిర్మాతగా వ్యవహరించబోతుందని ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాలో వాటా తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా అటు రాజమౌళితో పాటు ఇటు హీరోలు ఇద్దరు అదే విధమైన పద్ధతి ఫాలో అయ్యారు. రెమ్యునరేషన్ కాకుండా వచ్చిన లాభాల్లో వాటా తీసుకున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే బాటలో మహేష్ బాబు కూడా పయనించబోతున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X