మళ్ళీ షాక్ ఇవ్వబోతున్న RRR.. వాయిదా చర్చల్లో రాజమౌళి టీమ్?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ RRR. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి అనంతరం తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక జనవరి 7వ తేదీన రావాల్సిన ఈ సినిమా మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు అయితే గట్టిగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి సినిమాను వాయిదా వేసే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

మెగా నందమూరి కాంబినేషన్

మెగా నందమూరి కాంబినేషన్

జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో అలరించబోతున్నాడు. ఇద్దరూ కూడా మొదటి సారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని దాటించేశాయి. మెగా నందమూరి కాంబినేషన్ అనగానే సినిమా బిజినెస్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. దానికితోడు రాజమౌళి స్టార్ హోదా కూడా దేశవ్యాప్తంగా సినిమాకు మార్కెట్ రేటు పెంచేలా చేసింది. దాదాపు తొమ్మిది వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో సినిమా థియేటర్ లోకి రానుంది.

అప్పుడే రావాల్సింది..

అప్పుడే రావాల్సింది..

దర్శకుడు రాజమౌళి నిర్మాత డివివి దానయ్య ఈ సినిమా విడుదల తేదీపై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా మూడోసారి కూడా మరో కొత్త డేట్ కోసం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అసలైతే ఈ ఏడాది దసరా సమయంలోనే భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనాతో పాటు ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరలు కూడా ఆలోచనలో పడేశాయి. ఇక ఫైనల్ గా 2022 జనవరి 7వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు.

పోటీ లేకుండా

పోటీ లేకుండా

సంక్రాంతి బరిలో పోటీ స్థాయి తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా మొదటివారంలోనే వీలైనంత ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకునేలా ప్లాన్ చేసుకుంటోంది. సినిమాకు సంబంధించిన ప్రతి అంశం కూడా సోషల్ మీడియాలో మంచి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఈజీగా బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుంది అని దర్శకుడు రాజమౌళి నమ్మకంతో ఉన్నాడు. కేవలం సినిమా ఎలాంటి పోటీ లేకుండా మంచి వాతావరణంలో రిలీజ్ చేస్తే చాలు అని కూడా ఆలోచించారు.

అందుకే ట్రైలర్ వాయిదా

అందుకే ట్రైలర్ వాయిదా

అయితే ప్రస్తుతం తన కరోనా కొత్త వేరియంట్ తీవ్రత ఎక్కువగా అలజడి రేపుతుంది. మళ్లీ మరోసారి లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు కూడా కథనాలు వినిపిస్తున్నాయి ఇప్పటికే పలు దేశాల్లో మళ్లీ ఎప్పటిలానే ఆంక్షలు విధించారు. థియేటర్స్ కూడా మూతపడుతున్నాయి. ఇక జనవరిలో మళ్లీ ఆ ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందనే ఆలోచనలు పడ్డట్లు సమాచారం. అందుకే ఇటీవల విడుదల కావాల్సిన ట్రైలర్ ను కూడా వాయిదా వేసుకున్నారు.

రిస్క్ లేకుండా ఉండాలని..

రిస్క్ లేకుండా ఉండాలని..

ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో నమ్మకం గా ఉంటేనే సినిమాను విడుదల చేయాలని దర్శకుడు రాజమౌళి ఆలోచిస్తున్నాడు దాదాపు 450 కోట్లకు పైగా ఖర్చు చేశారు. సినిమాపై డిస్ట్రిబ్యూటర్లు భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టారు. కాబట్టి అందరి లైఫ్ కూడా చాలా రిస్క్ లో ఉన్నట్లు. అందుకే రాజమౌళి రిస్క్ చేయవద్దు అని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం అయితే జనవరి 7వ తేదీ అని ఆలోచనలో ఉన్నారు. అయితే పరిస్థితులు ఏమాత్రం మారినా కూడా మళ్లీ వాయిదా వేయవచ్చు అని తెలుస్తోంది. అందుకే ఒక కొత్త డేట్ కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X