మహేష్ కోసం మరో అగ్ర హీరోను లాగుతున్న రాజమౌళి.. కాంబో సెట్టయితే బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే!

దర్శకధీరుడు రాజమౌళి ప్రతి సినిమా విషయంలో ఏ విధంగా ఆలోచిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను ఆలోచించే విధానంలో ప్రేక్షకుల అంచనాలకు అందకుండా అడుగులు వేస్తాడు అని చాలా సార్లు రుజువు అయ్యింది. ఇక RRR సినిమా అనంతరం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ మూవీ కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరపైకి తీసుకు రాబోతున్నాడు. అయితే ఆ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు రాజమౌళి టాలీవుడ్ సీనియర్ హీరోను రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే మాత్రం బాక్సాఫీసు రికార్డులను బ్లాస్ట్ అవ్వాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..

 నెల రోజుల గ్యాప్ అనంతరం

నెల రోజుల గ్యాప్ అనంతరం

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రాజమౌళితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాడు. మొత్తానికి వీరి కలయికలో సినిమా రాబోతున్నట్లు గా అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇచ్చారు. రీసెంట్ గా కూడా దర్శకుడు రాజమౌళి హీరో మహేష్ బాబు ఇద్దరు కూడా నిర్మాతతో కలిసి ఒక ప్లాన్ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. RRR సినిమా తర్వాత ఒక నెల రోజుల పాటు గ్యాప్ తీసుకొనున్న రాజమౌళి ఆ తర్వాత మహేష్ ప్రాజెక్టును లైన్లో పెట్టబోతున్నాడు.

 ఎలాంటి సినిమా రానుంది?

ఎలాంటి సినిమా రానుంది?

మహేష్ రాజమౌళితో చేయబోయే SSMB29 పై గత కొంత కాలంగా అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో రాబోతుంది అని మహేష్ బాబు ప్రపంచాన్ని కాపాడే ఒక మోస్ట్ పవర్ఫుల్ వారియర్ గా కనిపించబోతున్నాడు అని కూడా రూమర్స్ వచ్చాయి. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు కూడా టాక్ ఆయితే వచ్చింది.

సెట్ అయినట్లే..

సెట్ అయినట్లే..

ఆ మధ్యకాలంలో రాజమౌళి తండ్రి కథారచయిత కె.విజయేంద్ర ప్రసాద్ కూడా వీరి కలయిక పై ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ అయితే సిద్ధమవుతోంది అని కానీ రాజమౌళి దాన్ని ఫైనల్ చేసే వరకు చెప్పలేము అని కూడా అన్నాడు. రీసెంట్ గా రాజమౌళి అలాగే మహేష్ బాబు నిర్మాతతో కలిసి విజయేంద్రప్రసాద్ రాసిన కథపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అంటే ఆల్మోస్ట్ పూర్తి కథ కూడా రెడీ అయినట్లు సమాచారం.

మహేష్, బాలయ్య కాంబో..?

మహేష్, బాలయ్య కాంబో..?

అయితే గతంలో వచ్చిన కథనాలను అన్నిటిని కూడా పక్కన పెడితే ప్రస్తుతం మాత్రం మరొక ఆసక్తికరమైన టాక్ ఒకటి ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది. ఈ సినిమాలో మరొక ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు రాజమౌళి నందమూరి బాలకృష్ణను సెలెక్ట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇదివరకే మహేష్ బాలయ్య కాంబినేషన్ పై చాలా రకాల అయితే వచ్చాయి. కానీ అవి ఏవి కూడా నిజం కాదని తెలిసిపోయింది.

Recommended Video

Rajamouli గురించి తెలిసే Mahesh Babu ఇలా | Mahesh Babu Rajamouli Movie || Filmibeat Telugu
 అవసరం అయితే ఒప్పిస్తాడు..

అవసరం అయితే ఒప్పిస్తాడు..

ఇక ఇప్పుడు మాత్రం మహేష్, నందమూరి బాలకృష్ణ కలిసి నటించే అవకాశం ఉన్నట్లు మళ్లీ సోషల్ మీడియాలో మరొక కొత్త టాక్ వినిపిస్తోంది. దర్శకుడు రాజమౌళి అనుకుంటే మాత్రం ఎలాంటి హీరో అయినా సరే తన సినిమాకు అవసరం అయితే వారిని తప్పకుండా ఒప్పిస్తాడు అని చాలా సార్లు రుజువు చేశాడు. ఇక బాలయ్య అవసరం అయితే కూడా రాజమౌళి వెనక్కి తగ్గడు. ఏదేమైనా ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X