Oscar కోసం పెట్టిన ఖర్చు మొత్తం వెనక్కి వచ్చేలా రాజమౌళి ప్లాన్.. అంతకుమించి అనేలా టార్గెట్!
దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ ఒక లెక్క ఇక నెక్స్ట్ చేయబోయే సినిమా మరొక లెక్క అనే విధంగా ఇప్పుడు అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. బాహుబలి సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న రాజమౌళి ఇటీవల RRR సినిమాను ఏకంగా ఆస్కార్ వరకు తీసుకువెళ్లడంతో తదుపరి సినిమాపై మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. అయితే ఆస్కార్ కోసం రాజమౌళి పెట్టిన ఖర్చుకు మూడింతలు మళ్లీ వెనక్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఓటమి లేకుండా..
రాజమౌళి మొదటి సినిమా నుంచి కూడా అపజయం లేకుండా ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో కథనం సరికొత్తగా ఉండేలా చూసుకుంటూ మంచి యాక్షన్ ఎమోషన్స్ కూడా సమపాళ్లలో బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. అందుకే అతను ఓటమి లేకుండా బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ ను పెంచుకుంటూ వస్తున్నాడు.

ఆస్కార్ వరకు
వీలైనంతవరకూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రాజమౌళి తన కథలను తెరపైకి తీసుకువస్తూ ఉంటాడు. ఇక మొదటి సినిమా నుంచి కూడా తన అన్నయ్య కీరవాణిని మార్చకుండా వస్తున్న విషయం తెలిసిందే. RRR సినిమా ద్వారా ఏకంగా కీరవాణిని ఆస్కార్ వరకు తీసుకువెళ్లడంలో రాజమౌళి పాత్ర ఎంతగానో ఉంది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో రాజమౌళి కీరవాణి స్థాయి మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఆస్కార్ కోసం ఖర్చు
అయితే ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి టీం చాలానే ఖర్చుపెట్టినట్లుగా కొన్ని కథనాలు వచ్చాయి. కొంతమంది అయితే డైరెక్ట్ గా కూడా కామెంట్ చేశారు. దాదాపు 80 కోట్ల వరకు రాజమౌళి ఆస్కార్ హడావిడి కోసం ఖర్చుపెట్టినట్లుగా ఒక టాక్ అయితే వినిపించింది. ముఖ్యంగా హాలీవుడ్ మీడియా సంస్థలతో ప్రమోషన్స్ నుంచి చిత్ర యూనిట్ సభ్యులందరినీ కూడా అమెరికాకు తీసుకువెళ్లడం వరకు అన్ని ఖర్చులు రాజమౌళి చూసుకున్నారట.

రెమ్యునరేషన్ తీసుకోకుండా..
రాజమౌళి ప్రతి సినిమాకు కూడా రెమ్యునరేషన్ తో కాకుండా నిర్మాతతో కలిసి లాభాల్లో వాటా తీసుకుంటూ వస్తున్నాడు. ముందుగానే రాజమౌళి చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా రెమ్యునరేషన్స్ ఫిక్స్ చేసి నిర్మాతతో సినిమాను మొదలు పెడుతున్నాడు. హీరోల నుంచి టెక్నీషియన్స్ అందరికీ కూడా ఒక రేటు ఫిక్స్ చేసి ఆ తర్వాత నిర్మాతతో కలిసి సినిమా బిజినెస్ లో ఒకరకంగా జక్కన్న పార్ట్నర్ గా కొనసాగుతున్నాడు అని చెప్పవచ్చు.

వెనక్కి వచ్చేలా ప్లాన్
అయితే ఇప్పుడు ఆస్కార్ హడావిడిలో రాజమౌళి ఖర్చుపెట్టిన ప్రతి పైసా కూడా తదుపరి సినిమాతో వెనక్కి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు తప్పకుండా హాలీవుడ్ లో కూడా ఒక క్రేజ్ అయితే ఏర్పడుతుంది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి ఫోకస్ ఇప్పుడు రాజమౌళి తదుపరి సినిమాపై పడింది. కాబట్టి ఆ క్రేజ్ రూపంలో మళ్ళీ రాజమౌళి బ్రాండ్ తో వచ్చే సినిమాకి బిజినెస్ పెరుగుతుంది. అలా ఆస్కార్ కోసం పెట్టిన ప్రతి పైసా వెనక్కి తీసుకోవచ్చు.

ఆ రేంజ్ లో బిజినెస్..
తప్పకుండా మహేష్ బాబు తో చేయబోయే సినిమా మాత్రం ఈజీగా 1000 కోట్ల బిజినెస్ చేస్తుంది అని అర్థమవుతుంది. ఇక ఆ సినిమా కోసం ఒకవేళ హాలీవుడ్ టెక్నీషియన్ నటీనటులు ఎవరైనా అవసరం ఉన్నా కూడా ఈజీగా ఒప్పించి తీసుకురావచ్చు అని ప్లాన్ కూడా రాజమౌళి వేషాడట. ఆస్కార్ పొందగలిగితే తదుపరి సినిమాకు చాలా హెల్ప్ అవుతుంది అని ఆలోచించినట్లు అర్థమవుతుంది. మరి మహేష్ తో చేయబోయే సినిమా రాజమౌళికి ఎలాంటి ప్రాఫిట్ అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











