SSMB 29: మహేష్ బాబుతో ఒక్కటి కాదట.. రాజమౌళి మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. లార్జర్ దెన్ లైఫ్ గా తెరకెక్కనున్న ఈ మూవీపై భారీ అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ భారీ బడ్జెట్ మూవీ 2023 చివర్లో వర్క్ షాప్‌లతో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ వర్క్ షాప్‌లు దాదాపు 6 నెలల పాటు కొనసాగుతుందట.

భారీ వీఎఫ్ఎక్స్ సినిమా కావడంతో వీఎఫ్ఎక్స్ కంపోజిషన్, గ్రీన్ కార్పెట్‌లో వాడకంపై ఈ వర్క్ షాపులు ఉంటాయని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ సినీ ప్రేక్షకులను ఊపేస్తోంది. అదేంటంటే.. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతున్న SSMB29 మూవీ 3 భాగాలుగా తెరకెక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

SS Rajamouli big plan with mahesh babu project

RRR సినిమా, ఆస్కార్ అవార్డుతో ఇంటర్నేషనల్ స్థాయిలో దూసుకెళ్లిన రాజమౌళి మహేష్ సినిమాతో ఆ మార్కెట్ ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే మహేష్ బాబుతో మూవీని అతిభారీగా తెరకెక్కించి గ్లోబల్ మార్కెట్ పై తన ముద్ర వేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

SSMB29 మూవీ ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచర్ ఫిల్మ్ అవుతుందని, అయితే చాలా మోడ్రన్ గా, సెట్టింగ్ లో మరింత విశాలంగా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే చెప్పారు. చాలా గ్రాండ్ గా ఉండబోతున్న ఈ సినిమాతో అంతర్జాతీయంగా పేరు రావడం పక్కానా తెలుస్తోంది. బ్రీత్ టేకింగ్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఈ సినిమా మరో రేంజ్ లో ఉండనుందని టాక్.

SS Rajamouli big plan with mahesh babu project

భారీ స్థాయిలో గ్లోబల్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించనున్న SSMB29లో పలువురు హాలీవుడ్ నటులు కూడా కనిపించే అవకాశం ఉందని సమాచారం. వారి అప్పీయరెన్స్ తో మరింత ప్రచారం వచ్చే ఛాన్స్ ఉందని రాజమౌళి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులతో ఈ సినిమా లార్జర్ దెన్ లైఫ్ గా తెరకెక్కనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే రాజమౌళి - మహేష్ బాబు కాంబో మూవీ హాలీవుడ్ ను తలదన్నే రేంజ్ లో ఉండనున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X