SS Rajamouli: మహేశ్ బాబుకు జక్కన్న కండిషన్స్... అప్పుడే మొదలుపెట్టాడుగా!
చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా తర్వాత ఆయన ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో దొరికేకుతున్న ఈ సినిమా తర్వాత ఆయన దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అయితే రాజమౌళి అప్పుడే మహేశ్ బాబుకు కండిషన్స్ పెట్టారంట. ఆ వివరాల్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా కథ గురించి స్టోరీ లైన్ గురించి అనేక ప్రచారాలు జరిగాయి. కానీ ఏ విషయం మీద అధికారికంగా క్లారిటీ లేదు. రాజమౌళి ఒక మాట చెబుతుంటే కథ రాసే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మరో మాట చెబుతున్నాడు. అసలు ఈ సినిమా కథ ఎంతవరకు వచ్చింది అనే విషయం మీద ఎవరికీ క్లారిటీ లేదు.

అయితే ఈ సినిమా విషయంలో మహేష్ బాబుకి రాజమౌళి చుక్కలు చూపిస్తున్నాడని ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. నిజానికి రాజమౌళి దర్శకత్వంలో ఒక హీరో నటిస్తున్నాడు అంటే కచ్చితంగా ఆ హీరోకి రాజమౌళి నుంచి ఒక రకమైన టార్చర్ ఉంటుందని ఆయనతో పనిచేసిన హీరోలందరూ ఆఫ్ ది రికార్డ్ గా చెబుతూ ఉంటారు. రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి వారు ఇదే విషయాలను చాలా సార్లు ప్రస్తావించారు కూడా.

ఇక ఇప్పుడు రాజమౌళితో సినిమా చేస్తున్న మహేష్ బాబు సైతం రాజమౌళి టార్చర్ అనుభవిస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అసలు విషయం ఏమిటంటే ఎప్పుడో తెరకెక్కాల్సిన సినిమాకి సంబంధించిన పనులను ఇప్పటినుంచి మహేష్ చేత చేయిస్తున్నాడట జక్కన్న. రాజమౌళి ఇప్పటి నుంచే కఠినంగా ఒక డైట్ ఫాలో అయ్యే విధంగా కొత్త న్యూట్రీషియన్ ని కూడా జక్కన్న.. మహేష్ బాబు కోసం అపాయింట్ చేశాడని అంటున్నారు.
నిజానికి ఈ సినిమాలతో సంబంధం లేకుండా మహేష్ బాబు తన డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు జక్కన్న న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ వచ్చిన సరే పెద్దగా ఇబ్బంది పడటం లేదని ఇప్పుడు రోజుకి 8 గంటలు జిమ్ చేస్తూ ఆహార డైట్ కూడా ఫాలో అవ్వాల్సి వస్తాం అని అంటున్నారు. నిజానికి మహేష్ బాబు ఇది చేయడం పెద్ద విషయమే కాదు.

కానీ ప్రస్తుతానికి ఆయన గుంటూరు కారం సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫైనాల్ షెడ్యూల్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఒకపక్క అది చూసుకుంటూ మరోపక్క ఈ డైట్ అనేది కాస్త కఠినంగా అనిపిస్తుందని మహేష్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి మాత్రం ఎక్కడా తగ్గేది లేదంటూ డైట్ విషయంలో కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందేనంటే మహేష్ బాబు సంకేతాలు పంపిస్తున్నాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











