Mahesh babu కోసం అగ్ర హీరోయిన్ పై రాజమౌళి ఫోకస్.. ఆ బ్యూటీ ఫిక్స్ అయినట్లే?
దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమా తర్వాత మహేష్ బాబుతో మరొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాను డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రేక్షకులలో ఎన్నో రకాల సందేహాలు కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాయి. అయితే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న మొట్టమొదటి సినిమాలో నటించబోయే హీరోయిన్ ఎవరు అనే విషయం లో కూడా ఒక టాక్ వైరల్ గా మారుతోంది. బాలీవుడ్ కి చేసిన స్టార్ హీరోయిన్ ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఆ హీరోయిన్ ఎవరు అని వివరాల్లోకి వెళితే..
Recommended Video


వరుసగా పాన్ ఇండియా సినిమాలు
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఒక్కసారిగా 12 వందల కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడంతో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కూడా మరో రేంజ్ కి వెళ్ళిపోయింది అని చెప్పాలి. ఆ ఇద్దరు హీరోలు ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలులను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే.

రాజమౌళి కోసమే..
ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ తరహాలోనే మహేష్ బాబు కూడా అంతకంటే ముందే పాన్ ఇండియా సినిమాలు చేయాలని అనుకున్నారు. కానీ రాజమౌళి కోసం ఆగాల్సి వచ్చింది. రాజమౌళికి పాన్ ఇండియా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి తప్పకుండా ఆయన తో సినిమా చేస్తే సక్సెస్ అవుతాము అని తెలిసే మహేష్ బాబు మిగతా దర్శకుల్ని నుంచి ఎలాంటి ఆఫర్లు వచ్చినా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

అలాంటి కథతో..
రాజమౌళి తప్పకుండా మహేష్ బాబును అంచనాలకు తగ్గట్టుగానే చూపిస్తాడు అని ప్రేక్షకుల్లో కూడా ఒక బలమైన నమ్మకం అయితే ఉంది. ఇక ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుందని అనలాల్ మంచి యాక్షన్ ఫిల్మ్ అవుతుంది అని కూడా ఇది వరకే ఒక టాక్ వినిపించింది. ఇక కథారచయిత విజయేంద్రప్రసాద్ కూడా అదే తరహాలో సినిమా ఉంటుంది అని అన్నారు. అయితే కథ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇటీవల మహేష్ బాబు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

హీరోయిన్ ఎవరు?
అయితే ఇంత పెద్ద సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే విషయంలో కూడా అనేక రకాల సందేహాలు వెలువడుతున్నాయి. ఒక విధంగా ఈ ప్రాజెక్టులో ఆఫర్ వస్తే మాత్రం చాలా మంది అగ్ర హీరోయిన్స్ మిగతా సినిమాలను పక్కన పెట్టి ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తారు అని చెప్పవచ్చు. ఇక ఇప్పటికే రాజమౌళి కొంతమంది హీరోయిన్స్ పేర్లను కూడా చర్చ లోకి తీసుకు వచ్చినట్లు సమాచారం.

ఆమె ఫిక్స్ అయినట్లే?
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే శ్రద్ధా కపూర్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఇది వరకే ఈ బ్యూటీ ప్రభాస్ తో సాహో సినిమా చేసిమా విషయం తెలిసిందే. అందులో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. కేవలం రొమాంటిక్ సన్నివేశాల్లో నే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆమె క్యారెక్టర్ బాగా క్లిక్ అయ్యింది.
ఇక ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు కలయికలో రాబోయే సినిమా కోసం కూడా ఆమెకు దాదాపు అలాంటి క్యారెక్టరే ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే శ్రద్ధ కపూర్ ఫిక్స్ అయినట్లు కూడా చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











