SSMB 29: మహేష్ సినిమాలో విలన్ కోసం జక్కన్న వేట.. చర్చల్లోకి తమిళ హీరో?
దర్శక ధీరుడు రాజమౌళి RRR సినిమా తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక వీరి కలయికలో మొట్టమొదటి సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందా అని అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక రాజమౌళి మహేష్ బాబుతో ఫ్యాన్ వరల్డ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన విలన్ పాత్ర కోసం ఒక తమిళ హీరోను సంప్రదించినట్లుగా ప్రస్తుతం ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ లో కూడా
దర్శకుడిగా తన స్థాయిని అంతకంతకు పెంచుకుంటూనే ఉన్న రాజమౌళి బాహుబలి తర్వాత RRR సినిమాతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో బాలీవుడ్ మీడియాలోనే కాకుండా హాలీవుడ్ మీడియాలో కూడా రాజమౌళి పేరు హాట్ టాపిక్ గా మారిపోయింది. విదేశీయులు కూడా ఇప్పుడు రాజమౌళి సినిమాలను ఎగబడి చూసేందుకు రెడీగా ఉన్నారు.

బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతనే
అయితే రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం దీర్ఘంగానే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు కథ అనుకున్న జక్కన్న ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ అయితే సిద్ధం చేస్తూ ఉన్నాడు. రాజమౌళి ఒక కథ రాసుకున్నాడు అంటే ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతనే దాన్ని సెట్స్ పైకి తీసుకు వెళుతూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ 29వ సినిమా కోసం పవర్ఫుల్ కథను అయితే సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో
ఇంతకు ముందు రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ చెప్పిన దాన్ని బట్టి మహేష్ బాబుతో చేయబోయే సినిమా అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అని ఒక టాక్ అయితే వినిపించింది. ఇక రాజమౌళి ఒక ప్రముఖ హాలీవుడ్ గ్రాఫిక్స్ సంస్థతో కూడా ప్రాజెక్టు గురించి చర్చలు జరిపినట్లు ఇదివరకే మరొక క్లారిటీ వచ్చింది. ముందుగానే గ్రాఫిక్స్ విషయంలో కూడా ఒక ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు.

విలన్ పాత్ర కోసం..
అయితే ఇప్పుడు ఫైనల్ స్క్రిప్ట్ తుది దశలో ఉండగా కొంతమంది ఆర్టిస్టులను కూడా ఫైనల్ చేయాలి అని రాజమౌళి మరొక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ కూడా హైలెట్ కాబోతున్నట్లు అనిపిస్తుంది. దర్శకుడు రాజమౌళి విలన్ పాత్ర కోసం ఒక తమిళ హీరోను సంప్రదించే ఆలోచనలో ఉన్నారట.

ఆ హీరోను అనుకుంటున్నారా?
ప్రస్తుతం అటు తమిళంలోనూ ఇటు తెలుగు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే.. రాజమౌళి తమిళ హీరో కార్తీ ని మహేష్ బాబు సినిమా కోసం సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒక స్టార్ యాక్టర్ అయితే మహేష్ బాబుతో పోటీపడే బలమైన విలన్ గా కనిపిస్తాడని సమాచారం. ఇక అతను ఫిట్నెస్ లో మార్పులు కూడా చేయాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారాలు మొదలయ్యాయి. ఇక సినిమా షూటింగ్ అయితే మహేష్ త్రివిక్రమ్ సినిమా తరువాత 2023 సమ్మర్ లో స్టార్ట్ కానుంది.


Click it and Unblock the Notifications











