బ్రహ్మాస్త్ర సినిమా కోసం రాజమౌళి హార్డ్ వర్క్.. ఇంతగా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే?
దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రమోషన్స్ విషయంలో కూడా ప్రత్యేకంగా ఒక ప్లాన్ తోనే ముందుకి సాగుతుంటారు. ఇక సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా తీరిక లేకుండా ప్రమోషన్స్ లో పాల్గొనే రాజమౌళి మొదటిసారి ఒక హిందీ సినిమా కోసం గ్యాప్ లేకుండా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక రాజమౌళి ఇంతగా ఎందుకు కష్టపడుతున్నారు అనే వివరాల్లోకి వెళితే..

RRR తరువాత
RRR సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న తరువాత జక్కన్న బ్రాండ్ ఒక రేంజ్ లో పెరిగింది. ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ అగ్ర హీరో కూడా రెడీగా ఉన్నారు. కానీ రాజమౌళి మాత్రం టాలీవుడ్ అగ్ర హీరోలతో ముందుకు సాగుతున్నారు. ఇక తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే.

బ్రహ్మాస్త్ర పార్ట్ 1పై నమ్మకం
అయితే రాజమౌళి తన కెరీర్ లో డైరెక్ట్ చేయని సినిమాలకు తనవైపు నుంచి కావాల్సినంత మేర ప్రమోషన్ చేశాడు. అందులో సక్సెస్ అయినవి చాలా తక్కువే. ఇక బ్రహ్మాస్త్ర పార్ట్ 1 సినిమా విషయానికి వచ్చేసరికి జక్కన్న తీరిక లేకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ కు కూడా మొదట ఆయన ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు చేశారు. కంటెంట్ మీద చాలా నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.

బుల్లితెరపై కూడా
ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమాను ప్రమోట్ చేయడం వెనుక కూడా రాజమౌళి ఉన్నారట. అయితే రాజమౌళి ఇటీవల సుమ క్యాష్ ప్రోగ్రాంలో కూడా రణ్ బీర్, ఆలియా భట్ ను తీసుకు వచ్చారు. అలాంటి షోలోకి ఇద్దరు స్టార్స్ ను రప్పించడం రాజమౌళికే చెల్లింది. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోను జనాలకు చేరవేయ్యాలని ఆయన చాలా గట్టిగానే శ్రమిస్తున్నారు.

బిజినెస్ లో జక్కన్న
ఇక రాజమౌళి ఆ విధంగా చేయడానికి ఒక కారణం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకు తెలుగులో సమర్పకుడిగా ఉన్న జక్కన్న బిజినెస్ లో కూడా భాగం ఆయినట్లు తెలుస్తోంది. ఆంద్రప్రదేశ్ లో బ్రహ్మాస్త్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులను రాజమౌళి తీసుకున్నట్లు సమాచారం. మిత్రుడు బళ్లారి సాయితో కలిసి ఆంధ్రలో జక్కన్న సినిమాను రిలీజ్ చేస్తున్నారట.

అందుకే ఈ రేంజ్ లో..
ఇక ఈ సినిమాలో బిజినెస్ లో భాగంగా సమర్పకుడిగా ఉన్న దర్శకుడు రాజమౌళి తెలుగు లాభాల్లో కొంత వాటా తీసుకునే విధంగా అగ్రిమెంట్ జరిగినట్లు ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా కంటెంట్ మీద కూడా రాజమౌళి చాలా నమ్మకంగా ఉన్నట్లు టాక్. అందుకే ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











