SS Rajamouli: హీరోలంతా జక్కన్న కోసం వెయిటింగ్.. కానీ ఆయన ఎవరి కోసం చూస్తున్నాడో తెలుసా?

దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన పేరు చెబితే.. ప్రపంచదేశాల్లో ఉన్న మూవీ లవర్స్ కూడా గుర్తు పడతారు. అంతలా ఆయనకు క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు జాతీయ స్థాయిలోనే కాదు.. ప్రపంచస్థాయిలో ఆకట్టుకుంటాయి. ఇక ఇటీవల తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన సత్తా ఏమిటో చూపించారు. ఇదిలా ఉంటే.. ఆయన డైరెక్షన్ లో సినిమా కోసం హీరోలంతా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఆయన కోసం ఓ హీరో కోసం ఎదురు చూస్తున్నారట. ఆయన ఎవరు.. ఏంటి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఓ సిరియల్ దర్శకుడిగా కెరియర్ మొదలు పెట్టిన ఎస్ఎస్ రాజమౌళి... ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. శాంతి నివాసం అనే సీరియల్ తో రాజమౌళి దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు శిష్యుడిగా ఎన్నో సినిమాలుక అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఇక ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా మారి... సంచలనం సృష్టించారు.

SS Rajamouli:

మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన రాజమౌళి.. కెరియర్ లో ఒక్క ఫ్లాప్ లేకుండా సినిమాలు తెరకెక్కిస్తూ వెళ్తున్నాడు. గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ కూడా లభించింది. జాతీయ స్థాయి అవార్డులు లభించాయి.

SS Rajamouli:

ఇక ఇదిలా ఉంటే.. రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమాలో అయినా నటించాలని హీరో హీరోయిన్స్ అనుకుంటారు. ఆయన ఛాన్స్ ఇస్తే నటించడానికి ఎంతో మంది ముందుకు వస్తారు. స్టార్ హీరోలు అయినా... ఎవరైనా సరే ఆయన డైరెక్షన్ లో నటిస్తే చాలు ఫేమస్ అయిపోవచ్చని భావిస్తారు. అయితే రాజమౌళి మాత్రం ఓ హీరోతో సినిమా చేయాలని ఆశపడుతున్నారని తెలుస్తోంది.

ఆ హీరోతో అవకాశం వస్తే అసలు మిస్ చేసుకోనని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ హీరో మరెవరో కాదు... కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నా.. ఆయనకు చరణ్, తారక్ అంటే ఇష్టమని చెప్పిన రాజమౌళి... సూర్య యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. చాలా నేచురల్ గా సూర్య యాక్టింగ్ ఉంటుందని వెల్లడించారు.

SS Rajamouli:

అయితే ఆయనతో ఛాన్స్ వస్తే.. సినిమా తెరకెక్కిస్తానని... కాకపోతే.. ఆయనతో తెరకెక్కించే స్క్రిప్ట్ నా వద్ద లేదని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆయనకు తగ్గట్లు కథ సెట్ అయితే కచ్చితంగా సినిమా తీస్తానని తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబు హీరోగా ఓ మూవీ తెరకెక్కించనున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజులో ఉంటుందని ఇప్పటికే తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X