మహేష్ బాబు సినిమా తరువాత ఆ సంస్థలో రాజమౌళి సినిమా.. హీరో ఎవరంటే?
దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమాతో ఏ స్థాయిలో సక్సెస్ అమ్ముకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో అంతకుమించి అనేలా మరొక భారీ ప్రాజెక్టును తెరపై తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. అయితే మహేష్ సినిమా తర్వాత రాజమౌళి ఎవరితో వర్క్ చేస్తారు అనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఒక బడా ప్రొడక్షన్ హౌస్ రాజమౌళితో ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఎవరైనా సిద్ధమే..
దర్శకుడు రాజమౌళి సినిమా చేస్తాను అంటే ఇండియాలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ ఏదైనా సరే అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలాకాలంగా టీ సిరీస్ తో పాటు జీ స్టూడియోస్ అలాగే మరికొన్ని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా రాజమౌళి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక తెలుగు నిర్మాతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటినుంచో ఆయనకు టచ్ లో ఉన్నారు కానీ రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

అడ్వాన్స్ ఇచ్చి మరీ..
అయితే ఒక విధంగా రాజమౌళి మాత్రం ముందుగా మాట ఇచ్చిన ప్రకారం చాలా మంది నిర్మాతలతో సినిమాలు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు రాజమౌళి ఎదుగుతున్న సమయంలోనే డివివి ధానయ్య పిలిచి మరీ ప్రత్యేకంగా అడ్వాన్స్ ఇచ్చారు. ఇక పదిహేనేళ్ళ తర్వాత ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి రాజమౌళి దానయ్యతో RRR అనే భారీ మల్టీస్టారర్ సినిమా చేశాడు.

బిగ్ బడ్జెట్ మూవీ
అయితే రాజమౌళి మహేష్ బాబు తో ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో KL నారాయణ నిర్మించబోతున్నాడు. ఆయనతో కూడా పదేళ్ల క్రితమే రాజమౌళి ఒప్పందం చేసుకున్నాడు. ఇక ఇచ్చిన మాట ప్రకారం రాజమౌళి ఇప్పుడు దాదాపు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఆ సినిమాను నిర్మించే అవకాశం ఉన్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

మహేష్ తరువాత..
అయితే మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి ఎవరితో వర్క్ చేస్తాడు అనే విషయంలో కూడా అనేక రకాల సందేహాలు వెలువడుతున్నాయి. అయితే ఐదేళ్ల క్రితం నుంచి రాజమౌళితో ఒక కన్నడ ప్రొడక్షన్ హౌస్ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కన్నడ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ లోను అలాగే సినిమా నిర్మాణంలోని మంచి అనుభవం ఉన్న KVN ప్రొడక్షన్స్ రాజమౌళితో చాలాకాలంగా టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

హీరో అతనే?
రాజమౌళితో సినిమా చేయాలని KVN ప్రొడక్షన్స్ చాలాకాలంగా ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఇక మహేష్ బాబు తర్వాత ఈ సంస్థలోనే సినిమా చేయవచ్చు అని ఇప్పుడు మరొక టాక్ వినిపిస్తోంది. అయితే ఆ సంస్థ మరోవైపు యష్ డేట్స్ కూడా తీసుకుంది. ఆయనతో కంటిన్యూగా రెండు సినిమాలు కూడా నిర్మించాలని ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక కన్నడ దర్శకుడు ఫిక్స్ కాగా ఆ తర్వాత రాజమౌళి యష్ కాంబినేషన్ ను ఈ సంస్థ కలిపే అవకాశం ఉన్నట్లుగా గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో కాలమే సమాధానం చెప్పాలి.


Click it and Unblock the Notifications











