మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరో షాక్ ఇవ్వబోతున్నాడా?
దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ రెండేళ్లు పడుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకొని సినిమా పనులను మొదలు పెట్టే జక్కన్న అనుకోకుండానే ప్రాజెక్ట్ టైమ్ స్పాన్ పెంచుకుంటూ వెళుతూ ఉంటాడు. అది అనుకోకుండా జరుగుతుందో లేక ఇతర కారణాల వల్లనో తెలియదు కానీ మొత్తానికి రాజమౌళి సినిమా మొదలు పెడితే మాత్రం తప్పకుండా అంత తొందరగా రాదు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ టాక్ ను తగ్గించుకోవాలని జక్కన్న చాలా సార్లు ప్రయత్నం చేశాడు. ఆఖరికి మర్యాద రామన్న, ఈగ సినిమాలో విషయంలో కూడా రాజమౌళి కాస్త ఆలస్యంగానే చేశాడు.
ఇప్పటివరకు కూడా అనుకున్న సమయానికి ఒక సినిమాను మాత్రం పూర్తి చేసి విడుదల చేసింది లేదు. ఇక RRR విషయంలో కూడా రాజమౌళి ఎప్పటిలానే ఆలస్యం చేశాడు. దానికి తోడు కరోనా వైరస్ కూడా కొంత ఇబ్బంది కలిగించడంతో సినిమా ఒక ఏడాది వాయిదా పడక తప్పలేదు. మొదటిసారి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలను ఒకే ఫ్రేమ్ చూపిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి. తప్పకుండా పాన్ ఇండియా మార్కెట్ కు ను మరో లెవెల్ కు వెళుతుందని ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక అందుకే సినిమా విడుదల విషయంలో ఎక్కువగా రిస్క్ తీసుకోవడం లేదు.

వీలైనంతవరకు మంచి పండగ సీజన్ లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పనులు పూర్తవ్వగానే మహేష్ బాబు కాంబినేషన్ లో మరో ప్రాజెక్టును మొదలు పెట్టబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఆ సినిమాతో రాజమౌళి మరో షాక్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మహేష్ బాబు సర్కారు వారి పాట అనంతరం వీలైనంత త్వరగా త్రివిక్రమ్ సినిమాను కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.
అయితే ఆ ప్రాజెక్ట్ లో ఉన్న మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం అంత త్వరగా అయితే డేట్స్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే రాజమౌళి కూడా మూడు నెలల గ్యాప్ దొరకడంతో ఒక చిన్న ప్రాజెక్టు ను తెరపైకి తేవాలని అనుకుంటున్నాడట. అయితే ఆయన దర్శకత్వం వహిస్తారు లేదో తెలియదు కానీ యువ దర్శకుడికి అవకాశం ఇచ్చి బాలీవుడ్ నటీ నటులతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కేవలం దర్శకత్వ పర్యవేక్షణలో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి అంటే ఎవరైనా సరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ లక్కీ ఛాన్స్ ఎవరు అందుకుంటారో చూడాలి. అలాగే మైత్రి మూవీ మేకర్స్ తో కూడా రాజమౌళి ఒక సినిమా చేసేందుకు గ్రీన్ ఇచ్చినట్లు టాక్ అయితే వస్తోంది.


Click it and Unblock the Notifications











