SSMB29: రాజమౌళి, మహేష్ ప్రాజెక్ట్ ప్లాన్ చేంజ్.. ఫస్ట్ వర్క్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటిసారి దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న మహేష్ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే రాజమౌళితో మొదటిసారి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. మహేష్ బాబు 29వ ప్రాజెక్టుగా తెరపైకి రాబోతున్న ఆ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా ఉండవు అని చెప్పవచ్చు.

RRR సినిమా తర్వాత అంతకుమించి అనేలా మరొక సినిమాను తెరపైకి తీసుకురావాలి అనే ఆలోచనతోనే రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు స్క్రిప్ట్ పనులన్నీ కూడా చివరి దశకు వచ్చినట్లు సమాచారం. అయితే సినిమా షూటింగ్ మొదలుకావడానికి ఇంకా చాలా సమయం ఉండడంతో దర్శకుడు రాజమౌళి ఇంకా ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం లేదు.

Director SS Rajamouli new plan for SSMB 29 regular shooting

అయితే ఒక ఫారిన్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థతో మహేష్ ప్రాజెక్టు కోసం ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు 29వ సినిమాను రాజమౌళి అమెజాన్ అడవుల నేపథ్యంలో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అసలైతే అనుకున్న ప్లాన్ ప్రకారం 2023 జనవరిలోని మొదలు కావాలి. కానీ అప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూర్తి కాదు కాబట్టి మహేష్ 28వ సినిమా పూర్తయిన తర్వాతనే రాజమౌళి తన కొత్త సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. ఇక ఆ కొత్త ప్రాజెక్ట్ 2023 ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రెగ్యులర్ షూట్ పనులు వచ్చే ఏడాది జూన్ లో మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇక షూటింగ్ ను 2024 లో చివరలో పూర్తిచేసి 2025లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు అని సమాచారం. మరి రాజమౌళి ఆ ప్రాజెక్టు కోసం ప్లాన్ ప్రకారం తొందరగా ఫినిష్ చేస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X