twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR సినిమా హడావిడి మళ్ళీ మొదలు.. మరో బిగ్ ప్లాన్ వేసిన రాజమౌళి?

    |

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో RRR సినిమా టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో కష్టపడి తెరకెక్కించిన ఈ సినిమా లో మొదటిసారి మెగా నందమూరి హీరోలు కలిసి నటించారు. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్ర లో నటించిన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా అనుకోకుండా కరోనా కారణంగా వాయిదా పడి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

    తప్పకుండా ఈసారి మార్చి 25న సినిమాను భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే గతంలో సంక్రాంతికి వస్తుంది అనుకుని చిత్ర యూనిట్ సభ్యులు నెల రోజుల ముందు నుంచే భారీ స్థాయిలో ప్రమోషన్ చేసిన విషయం తెలిసిందే. అందుకోసం 20 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా కూడా ఒక టాక్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ సినిమాను విడుదల చేయాలి కాబట్టి రెగ్యులర్ ప్రమోషన్స్ మొదలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమోషన్స్ విషయంలో అయితే దర్శకుడు రాజమౌళి ఏ మాత్రం వెనక్కి తగ్గాడు అని అందరికీ తెలిసిన విషయమే. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి మరోసారి కష్టపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

     Director ss rajamouli new plans for RRR movie promotion

    ముఖ్యంగా అన్ని భాషల వారిని ఆకట్టుకునే విధంగా ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని చేస్తున్నారు. అంతేకాకుండా యూఎస్ లో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఉన్నట్లు గతంలో వచ్చిన అడ్వాన్స్ బుకింగ్స్ తోని ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నారు అనగానే అమెరికాలో ఈ సినిమాను చూసేందుకు తెలుగు జనాలు చాలా ఎగబడ్డారు. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమా వన్ మిలియన్ డాలర్స్ అందుకునే విధంగా అడుగులు వేసింది. ఇక ఈ సినిమా వాయిదా పడినట్లు తెలియగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి మళ్ళీ డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేశారు.

    అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అమెరికాలో కూడా రెండు వారాల కంటే ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అంతే కాకుండా అక్కడ కూడా ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ అలాగే రాజమౌళి ముగ్గురు అమెరికాలో ఒక ఈవెంట్ తో భారీగా ప్రమోషన్ చేయాలని ఆలోచిస్తున్నారట. మరి ఆ ప్రణాళికలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి. ఇక RRR సినిమా సీక్వెల్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు కొన్ని కథనాలు వేకువడుతున్నాయి. రచయిత విజేయేంద్ర ప్రసాద్ ఇటీవల దర్శకుడితో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. మరి ఆ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

    English summary
    Director ss rajamouli new plans for RRR movie promotion
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X