SS.Rajamouli: మహేష్ బాబు తరువాత దర్శకధీరుడితో చేయబోయే హీరో అతనే.. ప్లాన్ రెడీ!

దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా అంచనాలకు తగ్గట్టుగా తెరపైకి తీసుకువస్తాడని అందరికీ తెలిసిన విషయమే. దేశంలోనే ప్రస్తుతం నెంబర్ వన్ దర్శకుడిగా కొనసాగుతున్న రాజమౌళి రెమ్యునరేషన్ కూడా అందరి కంటే ఎక్కువ స్థాయిలో తీసుకుంటున్నాడు. చాలామంది అగ్ర నిర్మాతలు కూడా ఆయనతో సినిమా చేయాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం ముందుగా ఎవరికైతే మాట ఇచ్చారో వారితోనే సినిమాలు చేయాలి అని అనుకుంటున్నారు. మహేష్ బాబు సినిమా తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ కు సంబంధించిన ముందస్తు ప్రణాళిక కూడా సిద్ధమైనట్లు సమాచారం. అందులో హీరో కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ అంచనాలతో..

భారీ అంచనాలతో..


బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్న దర్శకుడు రాజమౌళి ఆ సినిమా అనంతరం అంతకుమించి భారీ అంచనాలతో RRR సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఇప్పటికే ఐదు సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా మార్చి 25న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటివరకు ఏ పాన్ ఇండియన్ సినిమా కూడా విడుదల కాని విధంగా RRR సినిమా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతుంది.

మహేష్ బాబుతో కూడా బిగ్ బడ్జెట్ మూవీ

మహేష్ బాబుతో కూడా బిగ్ బడ్జెట్ మూవీ

మొత్తానికి RRR సినిమా అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ తో థియేటర్లోకి రాబోతోంది. కాబట్టి తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తుంది అని చెప్పవచ్చు ఒక విధంగా రాజమౌళి స్థాయి కూడా మరింత పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక రాజమౌళి మహేష్ బాబు తో పూర్తి కథతో తదుపరి సినిమాను త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడు. ఆ సినిమా ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో తిరుగుతుంది అని ఒక క్లారిటీ వచ్చేసింది.

మహేష్ తరువాత

మహేష్ తరువాత

ఇక మహేష్ బాబు సినిమా తర్వాత కూడా రాజమౌళి మరో హీరోతో ముందుగానే అగ్రిమెంట్ చేసుకోబోతున్నట్లు టాక్ వస్తోంది. చాలామంది దర్శకులు కూడా మరో రెండు మూడేళ్ల వరకు బిజీగా ఉండే విధంగా ఇతర స్టార్ హీరోలను ముందుగానే కథలు చెప్పి ఒక స్లాట్ అయితే సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మళ్లీ హీరోలు వేరే ప్రాజెక్టులను ఓకే చేసుకుంటే వారి డేట్స్ సంపాదించడం చాలా కష్టం అవుతుంది. అందుకే రాజమౌళి ముందుగానే ఒక హీరోతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

రాజమౌళి మనసులో అల్లు హీరో

రాజమౌళి మనసులో అల్లు హీరో

ప్రస్తుతం రాజమౌళి మనసులో ఉన్న ఆ హీరో మరెవరో కాదు. మెగా కాంపౌండ్ కు చెందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని తెలుస్తోంది. పుష్ప 1 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మొత్తానికి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో సిద్ధమవుతున్నాడు. అంతే కాకుండా బాలీవుడ్ దర్శకులతో కూడా ప్రస్తుతం హిందీ సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు.

Recommended Video

Rajamouli గురించి తెలిసే Mahesh Babu ఇలా | Mahesh Babu Rajamouli Movie || Filmibeat Telugu
 స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

ఇక రాజమౌళి తో కూడా అల్లు అర్జున్ ఎప్పటినుంచో సినిమా చేయాలి అనుకుంటున్నాడు. అసలైతే మగధీర సినిమా తర్వాతనే వీరి కాంబినేషన్ తెరపైకి రావాల్సింది. కానీ ఇద్దరికీ సరైన సమయం దొరకలేదు. ఇక ఇప్పుడు మాత్రం మహేష్ సినిమా పూర్తి చేసిన తర్వాత రాజమౌళి 2023 లో అల్లు అర్జున్ తో సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి రాజమౌళి ఒక్క ఏడాదిలోనే మహేష్ బాబు సినిమాను పూర్తి చేస్తాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X