SS Rajamouli: ప్రభాస్ కల్కి 2898 AD సినిమాలో జక్కన్న.. ఎలాంటి రోల్ చేస్తున్నారంటే?

తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన తీసినవి కొన్ని చిత్రాలే అయినప్పటికీ... అన్ని సూపర్ హిట్లే. ప్రస్తుతం రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేశ్ బాబుతో జంగిల్ అడ్వాంచర్ యాక్షన్ సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డారు. ఇప్పటికే స్క్రిప్టు కూడా పూర్తి అయినట్లు వార్తలు వచ్చాయి. ఇక రాజమౌళి గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఆయన కల్కి చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోక వెళితే...

ఎస్ఎస్ రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత మరింత పాపులర్ అయ్యారు. ఆయన సిసిమాలు బహుబలికి ముందు ఒక లెక్క బహుబలికి తర్వాత మరో లెక్క అని చెప్పవచ్చు. ఎప్పుడైతే ప్రభాస్ తో కలిసి బహుబలి, బహుబలి 2 చిత్రాలు తీశాడు.. ఆయన స్థాయి హాలీవుడ్ కు చేరిపోయింది. ఈ చిత్రం ప్రఫంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించాయి. ఇక ప్రభాస్, రాజమౌళి బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Director SS Rajamouli Playing Major Role As Veda Vyas in Prabhas Kalki 2898AD News Goes Viral

వీరు మంచి స్నేహితులు. ఇక రాజమౌళి.. ప్రభాస్ సినిమాలో నటిస్తున్నట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ గత ఏడాది సలార్ చిత్రం హిట్ తో జోష్ మీద ఉన్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ప్రస్తుతం ఆయన రాజా సాబ్ చిత్రంతో పాటు.. కల్కి 2898 ఏడి చిత్రంతో బిజీగా ఉన్నాడు. రాజా సాబ్ చిత్రం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా పోస్టర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక మహా నటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కల్కి 2898 ఏడి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే రీలజ్ కావాల్సి ఉండగా.. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తుంది. ప్రభాస్ కు విలన్ గా కమల్ హాసన్ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపిక పదుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వారికి కలిసి వచ్చిన డేట్ మే 9వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు.. పలు విదేశీ భాషల్లో కల్కి రిలీజ్ కానుంది. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఎప్పటి నుంచో ఈ చిత్రంలో రాజమౌళి నటిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.

ఇప్పుడు తాజాగా రాజమౌళి క్యారెక్టర్ లీక్ అయింది. కల్కి 2898 ఏడి చిత్రంలో రాజమౌళి నటించనున్నట్లు తెలుస్తోంది. జక్కన్న క్యారెక్టర్ పేరు వేద వ్యాస్. ఇది ఈ చిత్రంలో కీలక పాత్ర అని తెలుస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ప్రభాస్ తో రాజమౌళి చిత్రం అంటే మామూలుగా ఉండదని.. అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X