SSMB 29కి రాజమౌళి ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా? బయటపెట్టిన దిల్ రాజ్
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో రాజమౌళి వరల్డ్ వైడ్ గా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం రాజమౌళి ఏకంగా తన నుంచి రాబోయే ప్రాజెక్ట్స్ తో వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేశారు. అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో హాలీవుడ్ కు తీసి పోకుండా అప్ కమింగ్ ప్రాజెక్ట్ SSMB 29ని రూపొందిస్తున్నారు. అయితే రాజమౌళి ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనేది? ప్రస్తుతం మహేశ్ బాబు SSMB 29కి రాజమౌళి ఎన్ని కోట్ల పారితోషికం తీసుకుంటున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. దానిపై రీసెంట్ ఈవెంట్స్ లో స్టార్ ప్రొడ్యూసర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
3 చిత్రాలతో.. 3700 కోట్ల వసూళ్లు..
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి 100శాతం సక్సస్ సాధించారు. తన సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఆదర్శంగా మారారు. హీరో, స్టోరీ, విలన్, మార్కెటింగ్, ఎలివేషన్ వంటి విషయాల్లో జక్కన్న మార్క్ ను మరెవ్వరు బీట్ చేయలేరనిపించారు. ఇక జక్కన్న తన చివరి 3 చిత్రాలతో ఏకంగా రూ.3700 కోట్ల గ్రాస్ ను బాక్సాఫీస్ నుంచి వసూల్ చేశారు. బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా ఆస్కార్ అవార్డ్ ను సంపాదించి పెట్టాడు.

1000 కోట్లతో SSMB 29..
ఇక ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఏకంగా వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేశారు. ఇండియాలోని ప్రధానమైన భాషల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ కొన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని రూ.1000 కోట్లతో దుర్గా ఆర్ట్స్ పై నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో టాప్ టెక్నీషియన్లతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటం విశేషం.
ఎస్ఎస్ రాజమౌళి పారితోషికం?
తను సృష్టించిన సెన్సేషన్ కు, ట్రాక్ రికార్డుకు ఎస్ఎస్ రాజమౌళి ఎన్ని వందల కోట్లు అడిగినా నిర్మాతలు ఇవ్వడానికి వెనకడబోరు అనేది అతిశయోక్తికాదు. ప్రస్తుతం ఇన్వెస్ట్ మెంట్ తో పాటు ప్రాఫిట్ పైనా అంచనాలు ఉండటంతో స్టార్స్ తీసుకునే రెమ్యునరేషన్ లో మార్పులు వచ్చాయని నిర్మాత దిల్ రాజ్ వెల్లడించారు. అయితే ఎస్ఎస్ రాజమౌళి కొన్నాళ్లుగా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని, కేవలం ప్రాఫిట్స్ లో షేర్స్ మాత్రమే తీసుకొంటున్నారని తెలిపారు. ఇక SSMB 29 చిత్రానికి రూ.200 కోట్ల పారితోషికంతో పాటు అదనంగా ప్రాఫిట్ షేర్స్ కూడా తీసుకొంటున్నారని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం. దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.
SSMB29 వివరాలు..
2025 ఫిబ్రవరి నుంచి మహేశ్ బాబు SSMB 29 చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు, అల్యూమినియం ఫ్యాక్టరీ, ఓడిశా, సౌత్ ఆఫ్రియా, కర్ణాటకలో కొంత మేర షూటింగ్ జరుపుకున్నారు. ప్రస్తుతం కెన్యాలో నెక్ట్స్ షెడ్యూల్ ను చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమార్ నటిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











