twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mahesh Babu పాన్ ఇండియా సినిమా కోసం మరో టాలెంటెడ్ హీరో.. రాజమౌళి థ్రిల్లింగ్ ప్లాన్?

    |

    దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. స్క్రిప్ట్ విషయంలో కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్న రాజమౌళి రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి అనంతరం మొదలుపెట్టబోతున్నాడు. అయితే ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరొక ముఖ్యమైన పాత్ర కోసం రాజమౌళి ఒక యువ హీరోను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది అతను ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

    హాలీవుడ్ లో కూడా..

    హాలీవుడ్ లో కూడా..

    రాజమౌళి RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆ సినిమా పై కేవలం బాలీవుడ్ ప్రముఖులు మాత్రమే కాకుండా హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం భారీ స్థాయిలో ప్రశంసలు కురిపించారు. సినిమా అద్భుతంగా ఉంది అంటూ ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులో కూడా సినిమా రన్నరప్ గా నిలవడం విశేషం.

     వాళ్ళతో చర్చలు

    వాళ్ళతో చర్చలు

    మొత్తానికి తదుపరి సినిమాపై రాజమౌళి అంచనాల స్థాయిని మరింత పెంచుతున్నాడు అనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల రాజమౌళి పలు హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసిన ఒక విజువల్ ఎఫెక్ట్స్ సంస్థతో కూడా వర్క్ చేసేందుకు చర్చలు జరిపాడు. తన టీమ్ తో ఫ్రాన్స్ వెళ్లిన రాజమౌళి అక్కడ తన సినిమాకు కావాల్సిన వర్క్ ప్లానింగ్ పై కూడా అన్ని వివరంగా అడిగి తెలుసుకున్నాడు.

    సినిమాలో మరో హీరో?

    సినిమాలో మరో హీరో?

    అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన అంశం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ ఇటీవల పూర్తిస్థాయిలో కథను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మరో హీరోను తీసుకోవాలనికూడా చర్చలు కొనసాగుతున్నాయట. సినిమాలో మరొక ముఖ్యమైన పాత్ర కోసం ఎవరైనా యువ హీరోని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని కూడా మాట్లాడుకున్నారట.

    నాని అయితే బెటర్?

    నాని అయితే బెటర్?

    ఇక చర్చల్లో భాగంగా రాజమౌళికి అందరూ నాని అయితే బెటర్ అని ఒక సలహా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కథా రచయిత విజయేంద్రప్రసాద్ సినిమాలో మహేష్ తరువాత ఆ పాత్ర బలంగా ఉండాలి అంటే నాని అయితే బెటర్ అని అనుకుంటున్నారట. ఈ విషయంలో ఇప్పటివరకు ఎవరు కూడా అఫీషియల్ గా అయితే స్పందించింది లేదు. కేవలం ఇండస్ట్రీలోనే కొంతమంది నానిని, రాజమౌళి సంప్రదించబోతున్నాడు అని ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

     నాని ఎప్పుడో చెప్పాడు

    నాని ఎప్పుడో చెప్పాడు

    ఒకవేళ నానిని రాజమౌళి అడిగితే మాత్రం సందేహం లేకుండా ఒప్పుకుంటాడు అని చెప్పవచ్చు. గతంలోనే రాజమౌళి దర్శకత్వంలో నాని ఈగ అనే సినిమా చేశాడు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా అవకాశం వస్తే రాజమౌళి దర్శకత్వంలో ఎలాంటి సినిమా చేయడానికైనా సిద్ధమే అని సినిమాలో చిన్న పాత్ర ఇచ్చిన కూడా చేస్తానని కూడా నాని పాజిటివ్ గా స్పందించాడు. మరి నిజంగానే స్పెషల్ పాత్ర కోసం నానిని సెలెక్ట్ చేసుకుంటారో లేదో చూడాలి.

    English summary
    Director ss rajamouli searching young hero for mahesh babu pan india project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X