SS Rajamouli: ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. అది రాజమౌళి ఫ్యామిలీ నుంచి.. ఎంట్రీ ఎప్పుడంటే?
సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త వారసులు వస్తూనే ఉంటారు. అయితే ఇండస్ట్రీలో వారసులు వస్తుంటారు పోతుంటారు కానీ.. టాలెంట్ ఉన్నవాళ్లే ఇండస్ట్రీలో ఉంటారు. ఇప్పటికే చాలా మంది వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ కొంత మంది మాత్రమే నిలదొక్కుకుని ఉన్నారు. ఇక మరో వారసుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన ఎవరో కాదు.. రాజమౌళి కొడుకు కార్తీకేయ. ఇప్పటి వరకు తండ్రికి సినిమా పనుల్లో హెల్ప్ చేసిన ఆయన.. నెక్ట్స్ సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది. అసలు వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎస్ఎస్ రాజమౌళి.. ఇది పేరు కాదు.. రాజముద్ర. మరి ఆయన సినిమాలకు ఎంత ప్రత్యేకత ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక మనకు ఆస్కార్ తీసుకు వచ్చాడు రాజమౌళి. అయితే ఆయన సినిమాలు అంటే.. ఆయన ఫ్యామిలీ సైతం పని చేస్తుంది. అందులో వినిపించే పేరు కార్తికేయ.

కార్తికేయ.. రాజమౌళి సొంత కొడుకు కాకపోయినా.. అంత కంటే ఎక్కువే పెంచుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ కుర్రాడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ చర్చ నడుస్తోంది. కార్తికేయ ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా టాలీవుడ్ వర్గాల ఇన్ సైడ్ టాక్. ఇక మొన్నటి వరకు అతన్ని బిజినెస్ మాన్ గా చూడాలనుకున్న రాజమౌళి... ప్రస్తుతం కార్తికేయ చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చాయని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వ్యాపారం వద్దు.. సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పిద్దామని ఫిక్స్ అయ్యారని ఓ టాక్ నడుస్తోంది. త్వరలో టాలీవుడ్ లోకి రాజమౌళి కొడుకు కార్తికేయ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కార్తికేయ నటనలో శిక్షణను కూడా తీసుకుంటున్నట్టున్నారట. అయితే ఈ విషయాలను ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఉంచి చేయిస్తున్నారట. అయితే కార్తీకేయ టాలీవుడ్ ఎంట్రీ తన దర్శకత్వంలో కాకుండా మరో కొత్త దర్శకుడితే చేయించాలని చూస్తున్నారట.
కార్తికేయ ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత రాజమౌళి స్వయంగా తన డైరెక్షన్ లోనే ఒక సినిమా చేసి కార్తికేయ కి ఒక మంచి హిట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే క్రమంలో రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తూనే ఇటు కార్తికేయ సినిమాకి సంబంధించిన పనులను కూడా శరవేగంగా జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక కార్తీకేయ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే.. మరో హీరో దొరికేసినట్లే. ఇప్పటికే తన టాలెంట్ అందరికీ తెలిసిందే.

తండ్రికి సినిమా విషయంలో అన్ని పనులు, ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడంటే.. స్టార్ హీరో పక్కా అంటున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబుతో సినిమా తెరకెక్కించే పనిలో పడిపోయారు. గుంటూరు కారం తర్వాత మహేశ్.. రాజమౌళితో సినిమాలో భాగం కానున్నాడు. ఇక రాజమౌళి మహేశ్ సినిమా కంటే ముందేే కార్తికేయ సినిమా రావచ్చని అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











