Radhe shyam: రాజమౌళి చూశాక కీలక మార్పులు.. నచ్చలేదని చెప్పడంతో ప్రభాస్ షాకింగ్ డిసిషన్!
నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా ప్రస్తుతం అందరికంటే ఎక్కువ మార్కెట్ తో కొనసాగుతున్న ఏకైక హీరో ప్రభాస్ అని అందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా ప్రభాస్ భవిష్యత్తులో హాలీవుడ్లో కూడా చక్రం తిప్పుతాడు అని ఇప్పటికే చాలా మంది సినీ పండితులు క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో కాస్త టెన్షన్ పడుతున్నాడు అని అర్ధమవుతోంది.
ఇక రాధే శ్యామ్ సినిమా రిజల్ట్ పై కూడా ప్రస్తుతం ప్రభాస్ చాలా కన్ఫ్యూజన్లో టెన్షన్ లో ఉన్నట్లుగా కూడా ఇంటర్వ్యూలు చూస్తేనే అర్థమవుతుంది. రాజమౌళికి ప్రత్యేకంగా ఒక షో వేసి చూపించగా ఆయన చాలా విషయాల్లో అప్సెట్ అయినట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అది వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ రేంజ్ కోసం..
రాధే శ్యామ్ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సాహో సినిమాతో పూర్తి స్థాయిలో ప్రేక్షకులను సంతృప్తిపరచ లేకపోయినా ప్రభాస్ ఈసారి మాత్రం పాజిటివ్ రిజల్ట్ ను అందుకోవాలి అని అనుకుంటున్నాడు.
అసలైతే ఈ సినిమాను మొదట కేవలం వందకోట్ల లోపే ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత యు.వి.క్రియేషన్స్ సినిమాను చాలా గ్రాండ్ గా తెరపైకి తీసుకురావాలని ప్రభాస్ రేంజ్ ను దృష్టిలో పెట్టుకుని ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో ఓపెన్గానే చెప్పేసాడు.

రాజమౌళి చూశాక..
ఇప్పటి వరకు సినిమా చూసిన వారు చాలా బాగానే ఉంది అని చిత్ర యూనిట్ సభ్యులపై ప్రశంసలు కురిపించారట. ప్రభాస్ తనకు నచ్చిన దర్శకులకు అలాగే కొంతమంది సినీ ప్రముఖులకు కూడా ప్రత్యేకంగా షోలు వేయించి మరి చూపించినట్లుగా తెలుస్తోంది.
అయితే రాజమౌళి చూసిన తర్వాత మాత్రం కొన్ని సన్నివేశాలపై చాలా అప్సెట్ అయినట్లు టాక్ వచ్చింది. ఈ సినిమా మూడు చెడిపోయే విధంగా సీన్స్ కొన్ని ఉన్నాయని అని నీరసంగానే స్పందించినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

రాజమౌళికి నచ్చలేదా?
సినిమా అయితే చాలా బాగా వచ్చింది అని రాజమౌళి ప్రభాస్ తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేపడుతున్నారు. అయితే ఇంతకు ముందు మాత్రం రాధే శ్యామ్ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై రాజమౌళి మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అని క్లారిటీ ఇచ్చారట. ఎడిటింగ్ పై చాలా పట్టు ఉన్న రాజమౌళి రాధే శ్యామ్ సినిమా చూసిన తర్వాత అనంతరం వచ్చే కొన్ని సన్నివేశాలు అనవసరంగా ఉన్నాయని, అవి సినిమాకు అవసరంలేదు అని కూడా ఓపెన్ గానే చెప్పేశాడట.

ప్రభాస్ చెప్పడంతో మార్పులు..
ఇక రాజమౌళి చెప్పిన సలహాలతో ప్రభాస్ ఏ మాత్రం ఆలోచించకుండా దర్శకధీరుడు చెప్పినట్లుగా ఎడిటింగ్ చేసేయమని వీటిలో కొన్ని మార్పులు చేయాలి అని కూడా చిత్ర యూనిట్ సభ్యులకు చెప్పినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.
ఒక విధంగా ప్రభాస్ ప్రతి కథ విషయంలో కూడా రాజమౌళి సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమాతో ప్రభాస్ ను నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా మార్చిన రాజమౌళి భవిష్యత్తులో ఈ హీరోతో మరో సినిమా కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











