విజయ్ దేవరకొండపై స్టార్ డైరెక్టర్ కన్ను... అది మహేష్ బాబు కథేనా?

Recommended Video

Vijay Devarakonda To Act In Sukumar's Next Movie

'గీత గోవిందం' సినిమాతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. అప్పటికే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి హిట్ సినిమాలతో మంచి ఫాంలో ఉన్న విజయ్... 'గీత గోవిందం'తో రూ. 100 కోట్ల కబ్ల్‌లో చేరడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

అప్పటి వరకు విజయ్ దేవరకొండను కేవలం టాలెంటెడ్ నటుడిగానే చూసిన టాలీవుడ్ టాప్ ఫిల్మ్ మేకర్స్ యూత్‌లో అతడికి ఉన్న క్రేజ్, రోజు రోజుకు పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో అతడితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా విజయ్‌ దేవరకొండ మీద ఓ స్టార్ డైరెక్టర్ కన్ను పడినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

విజయ్ దేవరకొండతో సుకుమార్ మూవీ?

విజయ్ దేవరకొండతో సుకుమార్ మూవీ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్ ఇటీవలే ‘రంగస్థలం' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. విజయ్ దేవరకొండతో త్వరలో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.

తెలంగాణ సబ్జెక్టుతో...

తెలంగాణ సబ్జెక్టుతో...

తన వద్ద ఉన్న తెలంగాణ నేపథ్యంలో ఉండే సబ్జెక్ట్ విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ బాగా సూటవుతుందని సుకుమార్ భావిస్తున్నారట. ఈ మేరకు అతడిని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? అనేది తేలాల్సి ఉంది.

అది మహేష్ బాబు కథేనా?

అది మహేష్ బాబు కథేనా?

సుకుమార్ గతంలో మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆయన చెప్పిన కథతో మహేష్ బాబు సంతృప్తి పడలేదట. ఆ కథనే విజయ్‌కు చెప్పినట్లు టాక్. ఇప్పటి వరకైతే సుకుమార్ నుంచి నెక్ట్స్ సినిమా ఏమిటనే దానిపై అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు.

ఓకే అయితే విజయ్ పంటపండినట్లే

ఓకే అయితే విజయ్ పంటపండినట్లే

సుకుమార్ సినిమా ఒకే అయితే విజయ్ దేవరకొండ పంట పండినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన సుక్కూతో సినిమా చేస్తే విజయ్ దేవరకొండ సినిమా రేంజ్ మరింత పెరుగుతుంది అంటున్నారు.

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ

మరో వైపు విజయ్ దేవరకొండ కూడా వరుస ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో బిజీగా ఉన్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యారు. కొటరాల శివ కూడా విజయ్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X