మరో స్టార్ హీరోపై ఫోకస్ పెట్టిన సుకుమార్..?
టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుల్లో ఒకరైన సుకుమార్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక కొత్త తరహా స్క్రీన్ ప్లే ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. ప్లాప్ సినిమాలు తీసినప్పటికి ఓ వర్గం ఆడియెన్స్ కు ఆ సినిమాలు కూడా అమితంగా నచ్చుతాయి. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్న ఆ బిగ్ బడ్జెట్ సినిమా ఆగస్ట్ 13న విడుదల కానుంది. అయితే ఆ సినిమా అనంతరం సుకుమార్ విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నట్లు గతంలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. నిజానికి సుకుమార్ విజయ్ దేవరకొండకు పూర్తి కథను కూడా చెప్పలేదట. కేవలం ఒక కాన్సెప్ట్ స్టోరీ లైన్ మాత్రమే చెప్పాడట.

దర్శకుడి మీద నమ్మకంతోనే విజయ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్. అయితే పుష్ప అనంతరం, విజయ్ సినిమా స్టార్ట్ కాకపోవచ్చని మరో టాక్ కూడా వస్తోంది. ఎందుకంటే విజయ్ సినిమాకు టైమ్ చాలా ఎక్కువ పడుతుందట. అదొక వార్ డ్రామా అని గతంలో రూమర్స్ బాగానే వచ్చాయి. ఇక అందుకే సుక్కు మరో హీరోపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. స్టార్ హీరోతో తన స్టైల్ లో ఒక సినిమా చేసిన అనంతరం విజయ్ దేవరకొండ సినిమాను 2022 ఏండింగ్ లో స్టార్ట్ చేయవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











