Pushpa 2: రష్మిక మందన్నాకు షాక్ ఇచ్చిన సుకుమార్.. పుష్ప 2కి ప్లాన్ మార్చిన లెక్కల మాస్టర్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో బన్నీ నటన, స్వాగ్, డైలాగ్స్, డ్యాన్స్ స్టెప్పులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. బన్నీ స్టైల్ ను, డైలాగ్ లను నార్త్ ఆడియెన్స్ తో పాటు విదేశీయులు సైతం రీల్స్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇక శ్రీవల్లి పాత్రతో రష్మిక మందన్నాకు కూడా విపరీతమైన క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా సామీ సామీ పాటలో రష్మిక వేసిన సిగ్నేచర్ స్టెప్పుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా 'పుష్ప: ది రూల్' వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. అందుకోసం డైరెక్టర్ ప్లాన్ మార్చి రష్మిక మందన్నాకు షాక్ ఇచ్చాడని టాక్.

హిందీలో వంద కోట్లు..
గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మసినిమా అన్నిచోట్లా మంచి రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. ఇక, ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగ్గా.. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లు రాబట్టడం విశేషం.

బన్నీ-రష్మిక కెమిస్ట్రీ..
పుష్ప సినిమాలో క్యాస్టింగ్ నుంచి మూవీ టేకింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్ లు, నటీనటుల పెర్ఫామెన్స్ ఒక్కో డైమండ్ అన్నంత టాక్ తెచ్చుకుంది. ఇక సమంత అదిరిపోయే స్టెప్పులేసిన స్పెషల్ సాంగ్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. అల్లు అర్జున్ డైలాగ్ డెలీవరీ, ఫైట్స్, యాక్టింగ్ తోపాటు శ్రీవల్లిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా యూత్ మనసును అట్రాక్ట్ చేసింది. ఇక వీళ్లిద్దరి కెమిస్ట్రీతో యావత్ దేశాన్ని ఫిదా చేసింది.

విలన్ గా సీనియర్ హీరో..
పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ తో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు సుకుమార్ క్యాస్టింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పుష్పరాజ్ ను స్ట్రాంగ్ గా ఢీకొట్టబోయేందుకు తన సెంటిమెంట్ నటుడు అయిన జగపతి బాబును రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా జగపతి బాబుకు సంబంధించిన షూటింగ్ ను వైజాగ్ లో చిత్రీకరించారు.

సరికొత్తగా పుష్ప 2..
ఇక ఈ సినిమాలో యాంకర్ అనసూయతో సుకుమార్ ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడనే వార్త ఇప్పటికే హాట్ టాపిక్ అయింది. మొదటి పార్టులో నెగెటివ్ రోల్ లో కనిపించిన అనసూయతో రెండో పార్టులో స్పెషల్ సాంగ్ ఎలా చిత్రీకరిస్తాడని చర్చించుకున్నారు. ఇలా ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేసుకుంటూ సరికొత్తగా పుష్ప 2ను తెరకెక్కించనున్నాడట సుకుమార్. ఇందులో భాగంగానే పుష్ప 2 స్టోరీ నేరేషన్ లో కీలక నిర్ణయం తీసుకున్నాడట ఈ లెక్కల మాస్టర్.

రష్మిక మందన్నాకు షాక్..
పుష్పలో శ్రీవల్లిగా అలరించిన రష్మిక మందన్నా పాత్రను పుష్ప 2లో తగ్గించారట డైరెక్టర్ సుకుమార్. ఈ సీక్వెల్ మూవీలో రష్మిక పాత్ర నిడివి తగ్గించి ఆమెకు షాక్ ఇచ్చాడట ఈ లెక్కల మాస్టర్. అయితే ఈ సీక్వెల్ సినిమా అంతా అల్లు అర్జున్ రూలింగ్ నేపథ్యంలో ఉండటంతో రష్మిక మందన్నాకు స్క్రీన్ స్పేస్ తగ్గించారని టాలీవుడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఇలా రష్మిక పాత్రను తగ్గించడమే కాకుండా లీడింగ్ యాక్టర్లతో కొత్త పాత్రలను డిజైన్ చేశారట సుకుమార్.

స్పెషల్ అట్రాక్షన్ గా..
ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ అన్ని జాగ్రత్తలతో తెరకెక్కిస్తున్నారు. త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఫ్యాన్స్ కు తన కొత్త ప్లాన్ తో తెరకెక్కించిన పుష్ప 2తో బోలెడన్నీ ట్రీట్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు. బన్నీ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న పుష్ప ది రూల్ సినిమాను 2024లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అంతేకాకుండా రష్మిక మందన్నా పాత్ర తగ్గించనా కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











