Pushpa 2 రిలీజ్ ఆరోజే.. RRR ఫార్ములాతో సుకుమార్ మెండ్ బ్లోయింగ్ స్కెచ్!

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ఇంటర్నేషనల్ స్థాయిలో సత్తా చాటిన చిత్రాల్లో 'పుష్ప: ది రైజ్' ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు యావత్ ప్రపంచం ఫిదా అయింది. అందుకే ఇప్పుడు తెరకెక్కిస్తున్న 'పుష్ప: ది రూల్' (Pushpa 2) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అందుకు తగినట్లుగా చిత్రీకరిస్తూ సంసిద్ధం అవుతున్నాడు సుకుమార్. ఇప్పటికే టీజర్, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి మరింత హైప్ పెంచేసిన సుక్కు RRR ఫార్ములాతో దిమ్మతిరిగే స్కెచ్ వేసినట్లుగా టాక్ నడుస్తోంది.

Director Sukumar Plans To Release Allu Arjun Pushpa 2 In 2024 April

స్పెషల్ కేర్: దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాంబినేషన్ లో మరోసారి రూపు దిద్దుకుంటున్న మూవీ పుష్ప 2. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు అనుగుణంగా నటీనటుల నుంచి టేకింగ్ వరకు సుకుమార్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరో జగపతి బాబు, బిగ్ బాస్ దివి, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించనున్నారు.

అమ్మవారిగా: పుష్ప 2 సినిమాను సుకుమార్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో ఇటీవల విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు (ఏప్రిల్ 8) సందర్భంగా దానికంటే ఒక్క రోజు ముందుగా ఏప్రిల్ 7న విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్ కు విపరీతమైన స్పందన వచ్చింది. మూడు నిమిషాలు ఉన్న టీజర్ లో అల్లు అర్జున్ కు హై రేంజ్ ఎలివేషన్ ఇవ్వగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో బన్నీ అమ్మవారి గెటప్పులో కనిపించి ఆశ్చర్యపరిచాడు.

Director Sukumar Plans To Release Allu Arjun Pushpa 2 In 2024 April

డిసెంబరులో రిలీజ్: ఇదిలా ఉంటే ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ పేరు మారిమోగిపోతూ మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. అందుకు తగినట్లుగా పుష్ప 2 విడుదల తేది, ప్రమోషన్స్ ను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అయితే సుకుమార్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నిజానికి పుష్ప 2 చిత్రాన్ని 2023 డిసెంబరులో విడుదల చేద్దామని ముందుగా అనుకున్నారు. కానీ ఇది వాయిదా పడనుందని తాజా సమాచారం.

సమ్మర్ గిఫ్ట్: 'పుష్ప: ది రూల్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా ఉన్నాయట. అందుకే పుష్ప 2 చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2024వ సంవత్సరంలో సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారని టాక్. అందుకోసం 2024 ఏప్రిల్ 7వ తేదీని పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ నుంచి సమాచారం. అంతేకాకుండా అతి త్వరలోనే ఈ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.

Director Sukumar Plans To Release Allu Arjun Pushpa 2 In 2024 April

దేశవ్యాప్తంగా ప్రమోట్: వీలైనంత త్వరగా పుష్ప 2 రిలీజ్ డేట్ ప్రకటించి పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ వేస్తుందట. అలాగే సుకుమార్, అల్లు అర్జున్ RRR తరహాలో దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసే యోచనలో ఉన్నారట. RRRను రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎలా అయితే ముఖ్య నగరాలకు వెళ్లి ప్రమోట్ చేశారో అలానే అల్లు అర్జున్ కూడా ప్రమోషన్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్. పుష్ప 2పై ఉన్న అంచనాలకు మించిన రేంజ్ లో ఇండియా లెవెల్లో క్రేజ్ తీసుకురావాలని సుక్కు ఇలాంటి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X