Pushpa 2: 6 నిముషాలు 60 కోట్లు.. పుష్ప 2లో హైలైట్ అదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయే న్యూస్!
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమా పుష్ప 2. గతంలో విడుదలై అన్ని భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప సినిమాకు సీక్వల్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్ మాస్ యాంగిల్స్ వెలికితీస్తూ ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు డైరెక్టర్ సుకుమార్. ఈ నేపథ్యంలో తాజాగా పుష్ప 2కి సంబంధించి బన్నీ ఫ్యాన్స్ కోరుకునే ఓ అప్‌డేట్ బయటకొచ్చింది. మరి ఆ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటో చూద్దామా..
ఎప్పుడైతే పుష్ప- 2 షూటింగ్ మొదలైందో అప్పుడే బన్నీ అభిమానుల్లో వైబ్రేషన్స్ మొదలయ్యాయి. అందుకు తగ్గట్లుగా శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేస్తూ చిత్ర అప్ డేట్స్ వదులుతూ అందరిలో క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాన్ ఇండియా ఆడియన్స్ కోరుకునే ఎన్నో అంశాలు ఉన్నాయట. ఈ కథను ఆసక్తికరంగా రాసుకున్న సుక్కు.. ప్రతి సన్నివేశంపై ప్రత్యేక శ్రద్ద పెట్టి తెరకెక్కిస్తున్నారట.

ఈ క్రమంలోనే రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా పుష్ప- 2 టీజర్ వదిలారు. ఇది చిన్న వీడియోనే అయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ హుషారెత్తేలా ఈ వీడియో ఉంది. దద్దరిల్లే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తో వదిలిన ఈ వీడియోలో అల్లు అర్జున్ లుక్ మేజర్ అట్రాక్షన్ అయింది. విడుదల చేసిన కాసేపట్లోనే రికార్డుల వేట షురూ చేసిన పుష్ప 2 టీజర్ ప్రస్తుతం నెట్టింట రచ్చ చేస్తోంది.
ఇదిలాఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయే న్యూస్ బయటకొచ్చింది. భారీ రేంజ్ లో ఈ సినిమా ప్లాన్ చేసిన సుకుమార్.. చిత్రంలోని ఓ ఆరు నిమిషాల ఎపిసోడ్ కళ్ళు చెదిరేలా, గతంలో ఏ సినిమాలో చూడని విధంగా డిజైన్ చేసి రూపొందిస్తున్నారట. ఈ ఒక్క సీన్ కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ సన్నివేశం చిత్రీకరణకు సుమారు నెలరోజులు పట్టిందని సమాచారం. మూవీ ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఈ సీన్ సినిమాలోనే హైలెట్‌గా నిలవనుందట. కూర్చున్న చోటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పూనకాలెత్తే ఈ సీన్ ఉంటుందని తెలుస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 2024 ఆగస్టు 15న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











