Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అఖిల్ కోసం తగ్గని స్టార్ డైరెక్టర్.. అన్ని కోట్లంటే రిస్కేమో..?
టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోల లిస్ట్ పెద్దగనే ఉంది. అయితే అందులో మెయిన్ గా అఖిల్ టాప్ లో ఉన్నాడనే చెప్పాలి. ఇప్పటివరకు మూడు సినిమాలు చేసిన ఈ అక్కినేని హీరో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటింది లేదు. మొదటి సినిమా అఖిల్ తోనే బయ్యర్లు భారీ స్థాయిలో నష్టపోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి బడ్జెట్ పెరగడం లేదు.
వీలైనంత వరకు సేఫ్ జోన్ లోనే అఖిల్ తో సినిమాలను నిర్మిస్తున్నారు. అయినా కూడా లాభాలు దక్కడం లేదు. ఇక నెక్స్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో రానున్న అఖిల్ ఎలాగైనా ఈ చిత్రంతో తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ప్లాప్ డైరెక్టర్ తో గీత ఆర్ట్స్ లాంటి సంస్థ సెట్ చేసి మరీ సినిమాను నిర్మిస్తోంది అంటే కంటెంట్ ఎదో కొత్తగా ఉంటుందనే కామెంట్స్ వస్తున్నాయి.
అయితే ఆ సినిమా తరువాత అఖిల్ సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి పని చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు స్టార్ హీరోలతోనే హై బడ్జెట్ సినిమాలు తీసిన సురేందర్ రెడ్డి అఖిల్ కి కూడా అలాంటి స్క్రిప్ట్ ఫిక్స్ చేసినట్లు టాక్. అయితే ఇంతవరకు పెట్టిన బడ్జెట్ కి ప్రాఫిట్స్ అందించని అఖిల్ పై 50కోట్లకు పైగా బడ్జెట్ అంటే కాస్త రిస్క్ చేసినట్లే అనే రూమర్స్ కూడా వస్తున్నాయి. పూర్తిగా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ లో అఖిల్ 5వ సినిమా తెరకెక్కే అవకాశం ఉందట. సురేందర్ బెస్ట్ మూవీస్ కిక్, రేసుగుర్రం స్టైల్ లోనే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి అఖిల్, సురేందర్ రెడ్డికి ఎంతవరకు హెల్ప్ అవుతాడో చూడాలి.