సురేంద్ర రెడ్డి పెళ్ళి ఎక్కడ..ఎప్పుడు..ఎవరితో?
దర్శకుడు సురేంద్ర రెడ్డి ఓ ఇంటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం ఈనెల 28న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో వైభవంగా జరగబోతోంది. ముహూర్తం ఉదయం 9.29 గంటలు. పెళ్ళి కూతురు పేరు దీపారెడ్డి. 'అతనొక్కడే' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సురేంద్ర రెడ్డి 'అశోక్', 'అతిథి', 'కిక్' చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన రామ్, జెనీలియా జంటగా 'ఊసరవెల్లి' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జెనీలియా హీరోయిన్ గా ఈ చిత్రంలో చేస్తోంది. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. అలాగే త్వరలో మహేష్ తోనూ మిస్టర్ ఫెరఫెక్ట్ అనే చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో క్రితం సంవత్సరం రిలీజైన కిక్ చిత్రంమంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సురేంద్ర రెడ్డి వైవాహిక జీవితం బాగుండాలని ధట్స్ తెలుగు కూడా కోరుకుంటోంది. సురేందర్ రెడ్డి వివాహానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.


Click it and Unblock the Notifications











