మెగా హీరోతో తేజ సినిమా... త్వరలో అధికారిక ప్రకటన!
రానా నేనే రాజు నేనే మంత్రి మూవీతో హిట్ ఇచ్చిన తేజ దర్శకత్వంలో మరో సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా ఉండదని సమాచారం. తేజ తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ నుంచి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం నాగ్ తో మూవీ చేయాలని తేజా భావిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆ న్యూస్ లో నిజం లేదని తెలిసింది. తాజాగా ఫిల్మ్ నగర్ సమాచారం మేరకు తేజ మెగా హీరోతో సినిమా చెయ్యబోతున్నట్లు సమాచారం.
హీరో రానా నేనే రాజు నేనే మంత్రి మూవీతో హిట్ ఇచ్చిన తేజ దర్శకత్వంలో మరో సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా ఉండదని సమాచారం. తేజ తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ నుంచి బయటకు వచ్చేశాడు. అలాగే వెంకటేష్ తో తీయనున్న ఆటా నాదే వేట నాదే మూవీ కూడా దాదాపుగా నిలిచిపోయిందని సమాచారం.

ప్రస్తుతం నాగ్ తో మూవీ చేయాలని తేజా భావిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆ న్యూస్ లో నిజం లేదని తెలిసింది. తాజాగా ఫిల్మ్ నగర్ సమాచారం మేరకు తేజ మెగా హీరోతో సినిమా చెయ్యబోతున్నట్లు సమాచారం. ఫిధా, తొలిప్రేమ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న వరుణ్ తేజ్ దర్శకుడు తేజ తో నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగినట్లు సమాచారం.
ప్రస్తుతం చర్చల దశల్లో ఉన్న ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. యాక్షన్ నేపద్యంలో తెరకేక్కబోయే ఈ మూవీ ని నిర్మాత అనిల్ సుంకర నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కు ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్, రీమాసేన్, సదా వంటి నటీనటులను పరిచయం చేసిన దర్శకుడు తేజ వరుణ్ తేజ్ ను ఎలా చూపిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











