పొలిటీషియన్సే టార్గెట్ - తేజ ‘దొంగలు’?
ఈ సారి ఈ దర్శకుడు రాజకీయ వ్యవస్థను అవినీతితో బ్రష్టుపట్టిస్తున్న రాజకీయ నాయకులను టార్గెట్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి 'దొంగలు' అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. 'దేశాన్ని దోచుకు తింటున్నారు' అనే సబ్ టైటిల్ దీనికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. మన రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అద్దం పడుతూ ఓ చిన్న రొమాంటిక్ లవ్ స్టోరీతో కూడిన పొలిటికల్ థ్రిల్లర్ గా దీన్ని రూపొందించనున్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
ఈ సినిమాను కూడా తేజ కొత్త వారితోనే తీయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఎందుకంటే పెద్ద హీరోలతో సినిమాలు తీయడం ఆయనకు నచ్చదు. ఓ ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ....పెద్ద హీరోలను నేను హ్యాండిల్ చేయలేను. వాటితో సినిమా తీయడం నాకు చేతకాదు అని తెగేసి చెప్పారు.
ఎందుకని జర్నలిస్టు ప్రశ్నించగా......సినిమా ఎలా తీయాలనేది పూర్తిగా దర్శకుడి ఇష్టాఇష్టాల మీద ఆధార పడి ఉంటుంది. సినిమా హిట్టయినా, ప్లాపయినా పూర్తిగా అతనిదే బాధ్యత ఉంటుంది. కానీ స్టార్స్‌తో పెట్టుకుంటే కొందరు పండితులు, హీరోలు సినిమా ఎలా తీయాలనేది వాళ్లే నిర్ణయిస్తారు. దర్శకుడు సినిమా ఎలా తీయాలనేది వాళ్లే నిర్ణయించాక ఇక మేమెందుకు? అనే రీతిలో సమాధానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications












