బాలయ్య, వెంకటేష్‌తో వర్కౌట్ కాలేదు... మరో స్టార్ హీరో మీద కన్నేసిన తేజ?

By Bojja Kumar

'నేను రాజు నేను మంత్రి' సినిమా విజయంతో దర్శకుడు తేజ మళ్లీ పాంలోకి వచ్చాడు. పెద్ద హీరోలతో వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే కారణాలు ఏమిటో తెలియదు కానీ చివరి నిమిషంలో ఆ ప్రాజెక్టులు క్యాన్సిల్ అవుతున్నాయి.

వెంకటేష్, బాలకృష్ణలతో ఆయన భారీ ప్రాజెక్టులకు కమిట్ కావడం, అయితే అనుకోని కారణాలతో బయటకు రావడం తెలిసిందే. ఇక బాలయ్యతో చేయాల్సిన ఎన్టీఆర్ బయోపిక్ లాంఛనంగా ప్రారంభం అయిన తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల తేజ ఈ ప్రాజెక్టు నుండి బయటకు వచ్చారు.

Director Teja next Film with Nagarjuna?

తాజాగా తేజ గురించి మరో హాట్ న్యూస్ వినిపిస్తోంది. త్వరలో ఆయన మరో అగ్రహీరోతో సినిమా కమిట్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు కింగ్ నాగార్జున. ప్రస్తుతం నాగార్జున కోసం ఓ స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ ప్రాజెక్టు విషయమై ఇంకా అఫీషియల్ సమాచారం అయితే లేదు. నాగార్జునతో ప్రాజెక్టు ఓకే అయి, అఫీషియల్‌గా లాంచ్ మొదలయ్యే వరకు ఎలాంటి సమాచారం బయకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారట.

నాగార్జున ప్రస్తుతం 'ఆఫీసర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X