Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్‌స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్‌కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్.. మళ్లీ ఇన్నేళ్లకు కలిసిన కాంబినేషన్
దర్శకుడు తేజ సినిమాల గురించి, ఆయన తెరకెక్కించే విధానం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిత్రం సినిమా నుంచి మొన్న వచ్చిన సీత వరకు ఆయన తీసిన సినిమాలెన్నో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందులో కొన్ని డిజాస్టర్స్‌గా మిగిలినా.. తన శైలిని మాత్రం విడిచిపెట్టలేదు. చివరగా చేసిన సీత సినిమా బెడిసికొట్టడంతో మళ్లీ కాస్త గ్యాప్ తీసుకున్నాడు.
కాంబినేషన్లపై దృష్టి..
తేజ తాను ఇంతవరకు పని చేసిన వారితోనే మళ్లీ జట్టు కట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో రానా, గోపీ చంద్ వంటి వారిని లైన్లో పెడుతున్నట్టు టాక్. రానాతో నేనే రాజు నేనే మంత్రి అంటూ భారీ హిట్ కొట్టిన తేజ.. మళ్లీ రానాతో ఓ సినిమాను చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఇంట్రెస్టింగ్ టైటిల్..
నేనే రాజు నేనే మంత్రితో హిట్ కొట్టిన తేజ.. మళ్లీ రానాతో కలిసి రాబోతోన్నాడని టాక్. ఈ సినిమాకు టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. రాక్షసరాజ్యంలో రావణాసురుడు అంటూ రానాతో మరింత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు అదిరిపోయే కథను సిద్దం చేసుకున్నాడని టాక్.
గోపీచంద్తోనూ..
జయం సినిమాలో పవర్ఫుల్ విలన్ రోల్‌ను పోషించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. అయితే మళ్లీ అప్పటి నుంచి తేజ దర్శకత్వంలో పని చేయలేదు గోపీచంద్. తాజాగా తేజ ఈ హీరోకు ఓ కథను వినిపించాడని టాక్. తేజ చెప్పిన కథ నచ్చడంతో గోపీచంద్ కూడా ఓకే అన్నట్టు తెలుస్తోంది.
Recommended Video
ఇద్దరూ బిజీగానే..
అయితే ముందుగా గోపీచంద్ సినిమానే మొదలయ్యే అవకాశాలున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే రానా చేతిలో ఇప్పటికే చాలా సినిమాలున్నాయి. అవన్నీ పూర్తి కావాలంటే చాలా సమయమే పట్టేట్టుంది. ఈలోగా గోపీచంద్‌తో సినిమాని పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నాడని టాక్.