20ఏళ్ళ తరువాత ఉదయ్ కిరణ్ సినిమాకు సీక్వెల్.. మళ్ళీ అలాంటి హీరో దొరుకుతాడా?

ప్రేమ కథలతో 15 ఏళ్ళ క్రితం సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తేజ. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తేజ మేకింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుందని అప్పట్లో అగ్ర దర్శకులు కూడా పొగిడారు. ఆయితే ప్రస్తుతం మాత్రం ఆయన గతంలో మాదిరిగా హిట్స్ అయితే అందుకోవడం లేదు. అయితే తన కెరీర్ మొదట్లో ఉదయ్ కిరణ్ తో కొంచెం ఎక్కువగా సినిమాలు చేసిన తేజ ఇప్పుడు అతనికి సంబంధించిన సినిమాకు సీక్వెల్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ సినిమాలు అప్పట్లో ఒక సెన్సేషన్

ఆ సినిమాలు అప్పట్లో ఒక సెన్సేషన్

దర్శకుడు తేజ మొదట అసిస్టెంట్ కెమెరామెన్ గా అసిస్టెంట్ దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక డైరెక్షన్ కంటే ముందు కెమెరామెన్ గా వర్క్ చేసిన తేజ రెమ్యునరేషన్ డైరెక్షన్ లోనే ఎక్కువగా ఉందని దర్శకుడు అవ్వాలని 2000వ సంవత్సరంలో డిసైడ్ అయ్యాడు. చిత్రం, జయం, నువ్వు నేను సినిమాలు అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి.

తక్కువ బడ్జెట్.. ఎక్కువ లాభాలు

తక్కువ బడ్జెట్.. ఎక్కువ లాభాలు

ఉషా కిరణ్ మూవీస్ లో రామోజీరావ్ నిర్మాతగా మొదటి సినిమాకు తేజ దర్శకత్వం వహించాడు. ఆ మొదటి సినిమా మరేదో కాదు. ఉదయ్ కిరణ్ ని నటుడిగా పరిచయం చేసిన చిత్రం సినిమా. రీమా సేన్ హీరోయిన్ గా నటించిన ఆ రొమాంటిక్ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. రామోజీ రావ్ ఇచ్చిన 40లక్షల్లోనే చిత్రం సినిమాను పూర్తి చేసిన తేజ బాక్సాఫీస్ వద్ద కోట్లల్లో లాభాలను అందించాడు.

చిత్రం సినిమాకు స్క్రిప్ట్ రెడీ

చిత్రం సినిమాకు స్క్రిప్ట్ రెడీ

ఇక ఇప్పుడు అలాంటి సినిమాకు సీక్వెల్ రెడీ చేయాలని దర్శకుడు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఉదయ్ కిరణ్ ని మైమరిపించేలా ఉండే హీరోను సెలెక్ట్ చేసుకోవడం అంటే కాస్త కష్టమే. తేజ ఎలాంటి హీరోను సెట్ చెసుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తేజ అందుకు సంబంధించిన స్క్రిప్ట్ ని రేడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Ravi Teja & Sai Dharam Tej To Team Up For Multi-Starrer
ఓటీటీ రిలీజ్ ?

ఓటీటీ రిలీజ్ ?

ప్రస్తుతం తేజ గోపిచంద్ తో అలిమేలు మంగ వెంకటరమణ అనే సినిమాను చేయడానికి రెడీ అవుతున్నాడు. అలాగే రానాతో కలిసి రాక్షసరాజ్యంలో రావణాసురుడు అనే సినిమా కూడా చేయనున్నాడు. వీటితో పాటు చిత్రం సీక్వెల్ తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వాలని దర్శకుడు బలమైన ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X