డైరెక్టర్ తేజ చేతుల్లోకి మరో స్టార్ హీరో సోదరుడు.. ఎన్టీఆర్ బావమరిది తరువాత అతనితోనే..

సీనియర్ హీరో తేజ ఎలాంటి సినిమాలు చేసినా కూడా తనదైన శైలిలో ప్రజెంట్ చేస్తాడు అనేది ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే. ఒక కథను క్యారెక్టర్ ను మైండ్ లో ఫిక్స్ అయితే అదే తరహాలో వెండితెరపైకి తీసుకురావాలని హార్డ్ వర్క్ చేస్తుంటారు. అలాగే నటీనటులతో కూడా హార్డ్ వర్క్ చేయిస్తారు. ఇక అలాంటి దర్శకుడి చేతుల్లో కొత్త వారిని పెడితే మొదట్లోనే బలంగా అవుతారని కొంతమంది నమ్మకం. ఇక ఇటీవల ఒక స్టార్ సోదరుడు తేజ ప్రాజెక్టులో సెలెక్ట్ అయినట్లు సమాచారం.

ఆ సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్

ఆ సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్

దర్శకుడు తేజ కెరీర్ మొదటి నుంచి కూడా ఎక్కువగా కొత్తవారితోనే సినిమాలు చేశారు. ముఖ్యంగా ఎంతో మంది టాలెంటెడ్ యువ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. చిత్రం, జయం, నువ్వు నేను వంటి సినిమాలు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టిబడికి భారీ లాభాలను అంధించాయి.

ఎన్టీఆర్ బావమరిదితో న్యూ మూవీ

ఎన్టీఆర్ బావమరిదితో న్యూ మూవీ

ఇక చాలా రోజుల తరువాత ఈ స్టార్ దర్శకుడు మరొకసారి పూర్తిగా కొత్త నటీనటులతో వర్క్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నితిన్ తో వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే. చిత్రం సినిమాకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం 1.1 అనే ఆ సినిమా నేటితరం యువత లవ్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కుతోంది.

అభిరామ్ దగ్గుబాటితో..

అభిరామ్ దగ్గుబాటితో..

ఇక ఆ సినిమా అనంతరం మరొక స్టార్ ఫ్యామిలీ నుంచి కూడా కొత్త హీరోను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు. రానా దగ్గుబాటి సోదరుడు, నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటి. చాలా రోజులుగా అభికి సంబంధించిన మొదటి సినిమా విషయంలో సురేష్ బాబు ఎంతగానో ఆలోచిస్తున్నారు.

Recommended Video

Potti Veeraiah ఇక లేరు | అప్పట్లో శోభన్ బాబు సలహాతో..!! || Filmibeat Telugu
వెంకటేష్ కోసం అనుకున్న కథలో..

వెంకటేష్ కోసం అనుకున్న కథలో..

కొంతమంది దర్శకులతో ఇదివరకే కథలను ఫైనల్ చేసినప్పటికీ సినిమా షూటింగ్ వరకు రాలేకపోయింది. ఇక ఫైనల్ గా తేజ చెప్పిన మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీ సురేష్ బాబుకు నచ్చడంతో సొంత బ్యానర్ లోనే అభిరామ్ తో ఆ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తారట. దర్శకుడు తేజ ఇదివరకే వెంకటేష్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. బహుశా ఆ కథను ఇటువైపు తిప్పేసి ఉంటారని రూమర్స్ కూడా వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X