తేజ ...ఓ వైరైటీ ఐడియా

ప్రస్తుతం ఆడియో మార్కెట్ చాలా డల్‌గా ఉంది. టాప్ హీరోలు చేసిన సినిమాలకే అంతంత మాత్రం గా ఆదాయం వస్తోంది. చిన్న సినిమాలకు అయితే ఆడియో మీద నిర్మాతలకు అసలు ఆదాయమే రావడం లేదు. కానీ సినిమాలో ఐదు పాటలకు 6నుంచి 12లక్షలు ఖర్చు అవుతోంది. దాంతో ప్రస్తుతం తేజ 'కేక' చిత్రం ఆడియో మార్కెట్ పట్టాలంటే యేం చేయాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడట.
ఈ చిత్రానికి చక్రి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ లోగా తేజకు కొత్త ఆలోచన వచ్చిందట. కేక పాటలను సినిమా విడుదలకు ముందు ఒక్కో పాటను అర నిముషం వ్యవధిలో అన్ని ఎఫ్ఎం రేడియోలకు ఇచ్చేస్తే వారు రెగ్యులర్‌గా ప్రచారం చేస్తారు. అదృష్టం బాగుంటే అవి బాగున్నాయన్న రిపోర్ట్ రావచ్చు. అప్పుడు కేసెట్, సీడీని మార్కెట్‌లో విడుదల చేస్తే బాగుంటుందని ఐడియా వచ్చిందట. ఈ పద్ధతి వల్ల ఆడియో కంపెనీకి, తమకూ లాభదాయకంగా ఉంటుందని తేజ అంటున్నారు. సర్లే ఈ ఐడియా ఫాలో అవుతాడా అంటే ...యేమో రేపు మరేదో ఆలోచన వస్తే దాన్నే అమలు చేస్తానంటున్నాడు తేజ.


Click it and Unblock the Notifications











