టీవీ యాంకర్‌తో డైరెక్టర్ రొమాన్స్.. విజయ్ దేవరకొండ సెట్ చేశాడా!

టాలీవుడ్ క్రేజీ హీరో కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు సంచలన వార్త ప్రచారం జరుగుతోంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. కానీ విజయ్ దేవరకొండకు తొలి సక్సెస్ అందించిన చిత్రం మాత్రం పెళ్లి చూపులు. పెళ్లి చూపులు చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ తో విజయ్ దేవరకొండ మరో చిత్రాన్ని తెరకెక్కింకిబోతున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా, విజయ్ హీరోగా అని అనుకుంటే పొరపడినట్లే. వివరాల్లోకి వెళదాం.

విజయ్ దేవరకొండ కొత్త అవతారం

విజయ్ దేవరకొండ కొత్త అవతారం

విజయ్ దేవరకొండ త్వరలో నిర్మాత అవతారం ఎత్తబోతున్నాడు. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ నిర్మాతగా కూడా విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నాడు. ఆ మధ్యన తన సొంత నిర్మాణ సంస్థ పేరు కూడా విజయ దేవరకొండ ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ ది హిల్. తన నిర్మాణ సంస్థలో రూపొందబోయే తొలి చిత్రం విషయంలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

తరుణ్ భాస్కర్ హీరోగా

తరుణ్ భాస్కర్ హీరోగా

పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్.. విజయ్ దేవరకొండ నిర్మాణంలో హీరోగా నటించబోతున్నాడు. తరుణ్ భాస్కర్ కు జోడిగా హాట్ యాంకర్ అనసూయ పేరు వినిపిస్తోంది. దాదాపుగా అనసూయ ఈ చిత్రానికి ఖారైనట్లే అని వార్తలు వస్తున్నాయి. అనసూయ విభిన్నమైన పాత్రలు స్పెషల్ సాంగ్స్ తో దూసుకుపోతోంది. అనసూయకు యువతలో మంచి క్రేజ్ ఉంది.

నలుగురి మధ్య

నలుగురి మధ్య

ఈ చిత్రం నలుగురి మధ్య ఉత్కంఠ భరిత సన్నివేశాలతో జరిగే కథ అని వార్తలు వస్తున్నాయి. తరుణ్ భాస్కర్, అనసూయ కాకుండా ఈ చిత్రంలో మరో ఇద్దరు ప్రముఖ నటులు కూడా నటించబోతున్నట్లు. వారి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. తన తొలి నిర్మాణంలో వస్తున్న చిత్రం కావడంతో విజయ్ దేవరకొండ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఫిబ్రవరి నుంచి ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ బిజీగా

విజయ్ దేవరకొండ బిజీగా

విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన రెండవసారి విజయ్ తో రొమాన్స్ చేస్తోంది. భరత్ కమ్మ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నాడు. గత ఏడాది హీరోగా రెండు విజయాలు అందుకున్న విజయ్.. ఈ ఏడాది నిర్మాతగా అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాం!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X