Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
త్రివిక్రమ్ లైన్ క్లియర్.. ఇక అతనితో మహేష్ బాబు సినిమా లేనట్లే..?
సినిమా ఇండస్ట్రీలో స్నేహం అనేది చాలా కొద్దీ కాలమే ఉంటుంది.. అది కూడా మనం సక్సెస్ లో ఉన్నంత వరకె ఉంటుందని చాలా మంది రెగ్యులర్ గా చెప్పే మాటలే. కానీ కొందరి హీరోల స్నేహం మాత్రం చూడటానికి చాలా బావుంటుంది. మెయిన్ గా దర్శకులకు హీరోలకు కూడా మంచి సాన్నిహిత్యం ఉంటుంది. అయితే ఎందుకో ఇటీవల మహేష్ బాబు తన క్లోజ్ డైరెక్టర్ ని దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.
మహేష్ 25వ సినిమా అనగానే
గతంలో మహేష్ బాబు ఎక్కువగా వంశీ పైడిపల్లితోనే కనిపిస్తూ ఉండేవారు. మహర్షి సినిమా ఒక విదంగా వారిని చాలా దగ్గర చేసింది. కానీ ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగా హిట్ కాలేదు. మహేష్ 25వ సినిమా అనగానే మహర్షిపై మొదటి నుంచి అంచనాల డోస్ పెరుగుతూ వచ్చాయి. ఇక రిలీజ్ అనంతరం ఓ వర్గం ఆడియెన్స్ ని ఆ సినిమా ఎక్కువగా సంతృప్తి పరచలేదనే టాక్ వచ్చింది.
మహేష్ బాబు అప్సెట్ అవ్వలేదట
ఒక విధంగా మహర్షి సినిమాకు పెద్దగా లాభాలు రాలేకపోయినప్పటికి మహేష్ బాబు అప్సెట్ ఏమి అవ్వలేదు. సరిలేరు నీ కెవ్వరు సినిమా అనంతరం మళ్ళీ వంశీతోనే వర్క్ చేయాలని అనుకున్నారు. కానీ వంశీ చెప్పిన కథ నచ్చకపోవడంతో ఊహించని విధంగా సర్కారు వారి పాటను సెట్స్ పైకి తేబోతున్నాడు. ఇక నెక్స్ట్ మరో మూడు నాలుగేళ్ళ వరకు మరో దర్శకుడికి డేట్స్ ఇవ్వలేని విదంగా మహేష్ కొత్త ప్లాన్ వేసుకుంటున్నాడు.
వంశీ మహేష్ కాంబో లేనట్లే..
పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సర్కారువారి పాట సినిమా అనంతరం మళ్ళీ అనిల్ రావిపూడి, రాజమౌళి లతో సినిమాలను చేయాలని మహేష్ అనుకుంటున్నాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ కూడా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లు టాక్. ఈ విధంగా చూసుకుంటే వంశీ పైడిపల్లి ఇప్పట్లో మహేష్ బాబుతో వర్క్ చేసే ఛాన్స్ లేదని టాక్ నడుస్తోంది.
Recommended Video
ఆ సినిమా కంటే ముందే
రాజమౌళి RRR తరువాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కంటే ముందే మహేష్ ఒక చిన్న కమర్షియల్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అలాగే ఇటీవల ఏఆర్.మురుగదాస్ కూడా మహేష్ కోసం కథ సెట్ చేస్తున్నట్లు చెప్పడంతో మహేష్ మరో మూడేళ్ళ వరకు కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసే అవకాశం కూడా ఉండదని చెప్పవచ్చు.