Balayya Mokshagna: బాలయ్య కొడుకుతో త్రివిక్రమ్.. ఆహా ఆ ఊహ ఎంత బావుందో?
నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజ ఎప్పుడెప్పుడు వెండితెరకు పరిచయం అవుతాడా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక వచ్చేస్తున్నాడు.. అంటూ ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తున్నాయి తప్ప.. క్లారిటీ అప్డేట్ ఇప్పటి వరకు రాలేదు. ఇక మరో న్యూస్ బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ కోసం.. దర్శకుడు త్రివిక్రమ్ రంగంలోకి దిగారట. అయితే దర్శకుడి పాత్ర కోసం కాదు.. అసలు మ్యాటర్ ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎంతో మంది వారసులు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీకి రంగం సిద్ధం అవుతుంది. నందమూరి తారకరామారావు మనవడు, బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తేజ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారనే వార్త ఎప్పటి నుంచో హల్ చల్ చేస్తూనే ఉంది. ఇక ఏపీ ఎన్నికల తర్వాతే మోక్షు సినిమా ఉంటుందని నందమూరి బాలయ్య చెప్పుకువచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఇటీవల అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సెట్లో మోక్షజ్ఞ సందడి చేశారు. ఆ ఫోటోలు నెట్టంట వైరల్ అయ్యాయి. మోక్షజ్ఞ భలే ఉన్నాడు అంటూ కామెంట్స్ వినిపించాయి. సినిమా కోసమే మోక్షజ్ఞ సన్నగా అయ్యారని టాక్ వినిపించింది. ఇక ఇటీవల ఎన్నికల్లో ఓటు వేసినప్పుడు కూడా మోక్షు ఫోటోస్ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరో న్యూస్ బయటకు వచ్చింది. మోక్షు కోసం రంగంలోకి గురూజీ దిగుతున్నాడట.
మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఒకవైపు ఈ సినిమా అప్డేట్ లతోపాటు మరోవైపు రెగ్యులర్ షెడ్యూల్ తో త్రివిక్రమ్ చాలా బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం కథ రెడీ చేసే పనిలో ఉండనున్నాడు గురూజీ.
అయితే బాలయ్య, త్రివిక్రమ్ మధ్య మంచి స్నేహమే ఉంది. బాబీ బాలయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమాను కూడా సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. అదే సంస్థతో పాటు త్రివిక్రమ్ సొంత బ్యానర్ ఫార్చూన్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఈ సినిమాకు భాగస్వామిగా ఉందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య, త్రివిక్రమ్ మధ్య అన్‌స్టాపబుల్ షో నుంచి మంచి స్నేహం ఏర్పడిందని తెలుస్తోంది.
అయితే త్రివిక్రమ్ మోక్షజ్ఞ తొలి సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ లేకపోయినా.. కథ విషయంలో సాయం చేస్తారనే టాక్ వినిపిస్తుంది. మోక్షజ్ఞ కోసం త్రివిక్రమ్ మంచి స్టోరీ సెట్ చేసే విషయంలో తన వంతు పాత్ర పోషిస్తాడని టాలీవుడ్ వర్గాల్లో ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఈ విషయంలో బాలయ్య కూడా త్రివిక్రమ్‌తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. మరి మోక్షజ్ఞ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయం తెలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











