త్రివిక్రమ్ దర్శకత్వంలో నాని మల్టీస్టారర్.. ఆ స్టార్ హీరోతోనే బిగ్ ప్లాన్?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక బిగ్ బడ్జెట్ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు కంటే ముందు త్రివిక్రమ్ కొంతమంది హీరోలతో చర్చలు కూడా జరిపాడు. అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత త్రివిక్రమ్ స్థాయి ఒక్కసారిగా మరింత పెరిగిపోయింది. దీంతో ఆయనతో సినిమాలు చేయడానికి మరి కొంతమంది స్టార్ హీరోలు ఆసక్తిని చూపించారు.

అయితే త్రివిక్రమ్ వెంటనే పెద్ద సినిమా చేయకుండా మరొక చిన్న సినిమా కూడా చేయాలని అనుకున్నారు కానీ అది వర్కౌట్ కాలేదు. త్రివిక్రమ్ మధ్యలో నేచురల్ స్టార్ నానితో కూడా చర్చలు జరిపాడు. ఇటీవల దసరా సినిమా ప్రమోషన్స్ లో నాని త్రివిక్రమ్ తో ఒక ప్రాజెక్టు గురించి చర్చించినట్లు కూడా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అది ఒక మల్టీ స్టార్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా నాని చిన్న హింట్ అయితే ఇచ్చాడు.

Director Trivikram srinivas multi starrer plan with star actors

అయితే త్రివిక్రమ్ కూడా ఎప్పటినుంచో ఒక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక నాని కూడా అదే విషయంపై వివరణ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ కాంబినేషన్ కు సంబంధించిన ఒక గాసిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ నానితో పాటు మరొక హీరోను ప్రాజెక్టులోకి తీసుకువచ్చి మల్టీ స్టార్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్ అని తెలుస్తోంది.

గతంలో వెంకటేష్ మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలకు రచయితగా వర్క్ చేసిన త్రివిక్రమ్ మరోసారి వెంకటేష్ కోసం వర్క్ చేయాలని అనుకున్నారు. అయితే రైటర్ గా కాకుండా ఆయన వెంకటేష్ ను డైరెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో వీరి కలయికకు చాలా సార్లు బ్రేకులు పడ్డాయి. అయితే వెంకటేష్ నానితో ఒకేసారి వర్క్ చేసేలా త్రివిక్రమ్ మల్టీస్టార్ కథను రూపొందించినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు ప్రాజెక్ట్ తర్వాత ఈ కాంబినేషన్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం నాని దసరా సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టు పాన్ ఇండియా స్థాయిలో మార్చి 30వ తేదీన విడుదలవుతోంది. ఇక మరోవైపు వెంకటేష్ హిట్ దర్శకుడు శైలిష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే సినిమా చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X