మహేష్ బాబుతో త్రివిక్రమ్.. ఒక్క నిమిషానికి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోతుంటాయి. అతడు సినిమాతో మొదటి సారి కలిసిన ఈ కాంబో ఇప్పటికి కూడా టీవీ వరల్డ్ లో TRP లతో రికార్డులను క్రియేట్ చేస్తుంటారు. ఇక మరోసారి వీరి కాంబోలో అలాంటి సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక యాడ్స్ కోసం త్రివిక్రమ్ తీసుకునే రెమ్యునరేషన్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

ఆ సినిమా సక్సెస్ కాకపోయినా..
మహేష్ త్రివిక్రమ్ రెండవసారి చేసిన చిత్రం ఖలేజా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. కానీ ఆ సినిమా కూడా టీవీల్లో వస్తే జనాలు ఇప్పటికి కూడా ఛానెల్ మార్చరు. అందులో మహేష్ కామెడీ టైమింగ్ ఆడియెన్స్ కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది.

ఇంటర్నేషనల్ యాడ్స్ కోసం
ఇక త్రివిక్రమ్ మహేష్ కాంబోలో సినిమాలు ఎక్కువగా రాకపోయినప్పటికి యాడ్స్ మాత్రం చాలా వచ్చాయి. ఒక విధంగా ఈ కాంబో ఆ విషయంలో చాలా సక్సెస్ అయ్యింది. ఇంటర్నేషనల్ యాడ్స్ కోసం కూడా కలిసే వర్క్ చేశారు. ఇక త్వరలోనే మరో కొత్త బ్రాండ్ కోసం కలవబోతున్నట్లు తెలుస్తోంది.

రెమ్యునరేషన్ ఎంతంటే
అయితే ఒక నిమిషం కూడా లేని యాడ్ కోసం మహేష్ కోట్లల్లో అందుకుంటే త్రివిక్రమ్ లక్షల్లో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. ఒకవిధంగా యాడ్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ లలో అదే నెంబర్ వన్ రెమ్యునరేషన్ అని టాక్ వస్తోంది. దాదాపు 30లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు టాక్. హాఫ్ డేలోనే షూటింగ్ పూర్తవుతుందట.

ఎన్టీఆర్ తో కూడా
సాధారణంగా ముంబైలో రెగ్యులర్ యాడ్స్ షూట్ చేసే టాప్ మోస్ట్ దర్శకులు 12లక్షల వరకు మాత్రమే అందుకుంటారట. కానీ త్రివిక్రమ్ మాత్రం వారికంటే డబుల్ పేమెంట్స్ అందుకుంటున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కు సంబంధించిన యాడ్స్ కూడా చాలా వరకు త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే వస్తుంటాయి. అలాగే త్రివిక్రమ్ యాడ్స్ కోసమని కొంతమంది బాలీవుడ్ స్టార్స్ తో కూడా వర్క్ చేశారు.


Click it and Unblock the Notifications











