సాయి పల్లవిపై మాస్ దర్శకుడి స్పెషల్ ఫోకస్.. ఆ రీమేక్ సినిమా కోసం..

టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక పాయింట్ డిఫరెంట్ గా ఉంటుంది. తన పాత్ర కూడా వీలైనంత వరకు కొత్తగా ఉండాలని చూసుకుంటుంది. రొటీన్ కమర్షియల్ ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా ఆమె చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపదని అందరికి తెలిసిన విషయమే. అయితే సాయి పల్లవికి ఇటీవల ఒక బిగ్ బడ్జెట్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు వివి.వినాయక్ నెక్స్ట్ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో భారీ స్థాయిలో తెరకెక్కించాలని ఇప్పటికే పూర్తి ప్లాన్ ను సెట్ చేసుకున్నారు. కోవిడ్ కారణంగా సినిమా పనులకు కాస్త బ్రేక్ అయితే పడింది. కానీ తప్పకుండా సినిమాను మరికొన్ని నెలల్లో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

Director vv vinayak special focus on Sai pallavi for Bollywood project

అయితే ఛత్రపతి రీమేక్ కోసం కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ ను సంప్రధించగా వారు డైరెక్ట్ గానే నో చెప్పారట. ఇక ఇప్పుడు సాయి పల్లవిపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కోవిడ్ అనంతరం మరికొన్ని సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి డేట్స్ దొరకడం కష్టమే అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక కమర్షియల్ సినిమా అయినటువంటి ఛత్రపతి రీమేక్ కు ఆమె ఒప్పుకుందా లేదా అనే విషయంలో ఇంతవరకు క్లారిటీ అయితే రాలేదు. త్వరలోనే బెల్లంకొండ టీమ్ హీరోయిన్ విషయంలో ఒక అప్డేట్ అయితే ఇవ్వనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X