సక్సెస్‌లో ఉన్నప్పుడు ఆ హీరోని రిజెక్ట్ చేసిన వినాయక్.. ఇప్పుడు అతనే దిక్కయ్యాడు!

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మాయాజాలం.. ఎప్పుడు ఎలాంటి రంగులు చూపిస్తుందో ఏ మాత్రం తెలియదు. గెలుపు ఉన్నంత వారకే ఇండస్ట్రీలో ఒక వాల్యూ ఉంటుంది. ఇక ఒక్క డిజాస్టర్ వచ్చినా కూడా ఆ దర్శకులకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్టే. ప్లాప్ కొట్టిన దర్శకులకు మరొక ఆఫర్ రావడం అనేది ఈ రోజుల్లో చాలా కాష్టంగా మారింది. ఇకపోతే ప్రస్తుతం వివి.వినాయక్ పరిస్థితి కూడా అలానే మారినట్లు తెలుస్తోంది.

అప్పట్లో ఇండస్ట్రీ హిట్స్..

అప్పట్లో ఇండస్ట్రీ హిట్స్..

వివి.వినాయక్ అంటే తెలియని మాస్ ఆడియెన్స్ ఉండరు. చాలా వరకు రిస్క్ తీసుకోకుండా కమర్షియల్ ఫార్మాట్ లోనే సక్సెస్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆది, దిల్, ఠాగూర్ వంటి సినిమాలతో ఎవరు ఊహించని విదంగా రికార్డ్స్ అందుకున్న వినాయక్ స్టార్ డైరెక్టర్ గా అప్పట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

 గట్టిగానే ట్రై చేస్తున్నాడు..

గట్టిగానే ట్రై చేస్తున్నాడు..

2002లో ఇండస్ట్రీలో ఆది సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వివి.వినాయక్ ఇప్పటివరకు 16సినిమాలను డైరెక్ట్ చేశాడు. అయితే మధ్య మధ్యలో వినాయక్ కొన్ని అపజయాలు ఎదుర్కొన్నాడు కానీ ఇలాంటి దారుణమైన పరిస్థితులను ఎన్నడు చూడలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాడనికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు గాని వర్కౌట్ కావడం లేదు.

బాలయ్యతో సెట్ అయ్యింది గాని..

బాలయ్యతో సెట్ అయ్యింది గాని..

నందమూరి బాలకృష్ణతో ఆ మధ్య ఒక సినిమాను స్టార్ట్ చేయాలని వినాయక్ గట్టిగానే ప్రయత్నం చేశాడు. కానీ స్క్రిప్ట్ అనుకున్నట్లుగా సెట్టవ్వకపోవడంతో సినిమా స్టార్ట్ కాకముందే క్యాన్సిల్ అయ్యింది. ఇక మరికొన్ని కథలను రెడీ చేసిన వినాయక్ చాలా మంది హీరోల చుట్టూ తిరుగుతున్నాడట. లాక్ డౌన్ లో నాలుగు కథలను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu Season 4 Dates Are Fixed,Here Is The Top List Contestents
ఫైనల్ గా ఒక హీరో..

ఫైనల్ గా ఒక హీరో..

ఇక మొత్తానికి వినాయక్ మాస్ యాక్షన్ కథకు గోపిచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలోనే వీరి కాంబినేషన్ లో ఒక సినిమా రానున్నట్లు రూమర్స్ వచ్చాయి. గోపిచంద్ కూడా గతంలో కొన్నిసార్లు సినిమా చేద్దామని అడిగితే వినాయక్ పెద్దగా పట్టించుకోలేదట. ఇక ఇప్పుడు చివరికి గోపిచంద్ వినాయక్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. వినాయక్ చివరగా ఇంటిలిజెంట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. మరి గోపిచంద్ సినిమాను వినాయక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X