డైరక్టర్ వైవియస్ చౌదరికి ఆ సినిమా పరీక్షే
బాలకృష్ణతో ఒక్క మగాడు, మంచు విష్ణు వర్ధన్ తో సలీం వంటి డిజాస్టర్ ఫిలింస్ ఇచ్చిన దర్శకుడు వైవియస్ చౌదరి. ఆయన ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు ధర్మ తేజను హీరోగా పరిచయం చేస్తూ రాయ్ అనే చిత్రం రూపొందిస్తున్నారు.తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం పెట్టుబడులు మాత్రం హీరో ప్యామిలీనుంచే అందుతున్నాయి. అయితే ఆ చిత్రం బడ్జెట్ పైనా, స్క్రిప్టుపైనా రకరకాల ఆంక్షలు పెట్టే కమిట్ చేసారని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని తను దేవదాసుతో పరిచయం చేసిన రామ్ తో చేద్దామని వైవియస్ అప్పట్లో రెడీ చేసుకున్నారు. అయితే ఫ్లాపుల ఎఫెక్టుతో రామ్ తన దగ్గరకు రానివ్వకుండా ఆ స్క్రిప్టుని కాచుకున్నాడు. దాంతో వైవియస్ ఎలాగయినా ఈ చిత్రం హిట్ కొట్టి తనని కాదన్న వారిచేతే శభాష్ అనిపించుకోవాలన్న కసితో వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. అది ప్రక్కన పెడితో ఇప్పటికే భాక్సాపీస్ వద్ద ఓపినింగ్స్ అయినా తెచ్చుకోగలడా అనే డౌట్ క్రియేట్ చేసుకున్న వైవియస్ ఈ చిత్రం అటు ఇటు అయితే తనకున్న కొద్ది పాటి మొదటి రోజు జనాల్ని కూడా పోగొట్టుకుంటాడనేది నిజం. పూర్తి రొమాంటిక్ స్టోరీగా తయారవుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించి మళ్ళీ వైవియస్ నిలబడతాడని ఆశిద్దాం..


Click it and Unblock the Notifications











