చిరు 150 వ మూవీకి క్యూ కట్టిన స్టంట్ డైరెక్టర్స్ వీరే....!?
మెగాస్టార్, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సినిమా చేస్తారనే పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో అగ్రదర్శకులంతా చిరు శిబిరానికి క్యూకట్టినట్లు తెలుస్తోంది. రోబో ఆడియో ఫంక్షన్ లో సినిమా చేయాలనిపిస్తోందటూ చిరు ఇచ్చిన స్టేట్ మెంట్ ను ఆయన జన్మదిన వేడుకల్లో రామ్ చరణ్ తేజ్ బలపరిచారు. వచ్చే యేడాది జన్మదినం నాటికి సినిమా ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే రచయిత చిన్నికృష్ణ శివయ్య నాయుడు అనే కథను చిరంజీవికి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్, గౌతమ్ మీనన్, మురుగదాస్, శంకర్, వివి వినాయక్, కృష్ణవంశీ, చిరంజీవి 150వ సినిమా కోసం క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో వేచి చూద్దాం.
చిరంజీవి చిన్ని కృష్ణ శంకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గౌతమ్ మీనన్ వివి వినాయక్ chiranjeevi chinni krishna shankar trivikram srinivas goutham menon vv vinayak


Click it and Unblock the Notifications