SS Rajamouli: జక్కన్నా ఇలా అయితే ఎలాగన్నా?.. నీకే టెన్షన్ పెడుతున్నారే!
దర్శక ధీరుడు రాజమౌళి... తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ఆయనకే చెల్లుతుంది. ఇక రాజమౌళి తన కెరియర్లో తెరకెక్కించిన సినిమాలు తక్కువే అయినప్పటికే.. ఒక్క ఫ్లాప్ లేకుండా దూసుకుపోతున్నాడు. అయితే బహుబలి సినిమాల తర్వాత ఆయన సినిమాలు వరల్డ్ వైడ్ గుర్తింపు పొందుతున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన మహేశ్ బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలోనే జక్కన్న భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చవిచూడలేదు. అంతే కాదు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన తెలుగు సినిమాను ప్రపంచానికి తెలియజేశారు. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డుతో పాటు.. పలు అవార్డులు లభించాయి. ఇక బహుబలి తర్వాత రాజమౌళి.. ఆయన సినిమాలు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ప్రస్తుతం మహేశ్ బాబుతో రాజమౌళి ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇదిలా ఉంటే.. రాజమౌళికి పలువురు దర్శకులు కొత్త భయాన్ని కలగజేస్తున్నారని తెలుస్తోంది. తన కెరీర్‌లో ఎప్పుడు లేనంత తీవ్రమైన ఒత్తిడిలో రాజమౌళి ఉన్నారని సమాచారం. ఫస్ట్ టైం ఆయనలో కాస్త భయం కూడా ఉందన్న ప్రచారం టాలీవుడ్ వర్గాల సమాచారం. రాజమౌళి ఒక్కో సినిమా చేసేందుకు మూడు, నాలుగు ఏళ్ల టైం తీసుకుంటారనే సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ సూపర్ స్టార్‌లు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటించారు.
పైగా ఇది రాజమౌళి బ్రాండ్ సినిమా కావడం... నాలుగేళ్లకు పైగానే ఈ సినిమా తెరకెక్కించడానికి టైం పట్టింది. అయితే అన్ని సంవత్సరాలు ఇద్దరు స్టార్స్ తమ సినిమాలు వదులుకుని చేస్తే.. బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్ల వసూళ్లు సాధించింది. అదే ప్రశాంత్ నీల్ ఒక సినిమా చేసేందుకు రెండేళ్లు టైం మాత్రమే తీసుకుని.... ఈ మూడేళ్లలో కేజిఎఫ్ 1, కేజీఎఫ్ 2, తాజాగా సలార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇక కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2.. రెండు కలిపి 2వేలకు పైగా కోట్లు సాధిస్తే.. ఇక సలార్ కూడా వెయ్యి కోట్లకు పైగానే వసూళ్లు రావచ్చని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజమౌళి.. ఇద్దరు సూపర్ స్టార్లను పెట్టుకుని నాలుగైదు ఏళ్ళు ఒక సినిమా తీసి రూ.1200 కోట్ల వసూళ్లు చేస్తే.. ప్రశాంత్‌నీల్ కేవలం ఇదే టైం లో మూడు సినిమాలు తీసి.. దాదాపు 3వేల కోట్లు సాధించారని తెలుస్తోంది. ఇక కేజీఎఫ్ 2.. ఆర్‌ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేయగా.. ఇప్పుడు సలార్ కూడా ఆర్‌ఆర్ఆర్ రికార్డులను తుడిచిపెట్టి దూసుకుపోతుందని తెలుస్తోంది.

ఇక మొన్న వచ్చిన సందీప్ రెడ్డి వంగా కూడా... ఏడాదిలోనే సినిమాలు తీసి.. వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తున్నారు. మరి ఇవన్నీ ఇప్పుడు రాజమౌళికి కచ్చితంగా సవాల్ విసురుతున్నాయి. మహేష్ బాబు సినిమాతో మరోసారి బాహుబలి 2 లా ఎవరికి అందని బెంచ్ మార్క్ సెట్ చేయాల్సిన ఒత్తిడి రాజమౌళిపై ఉందని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది.


Click it and Unblock the Notifications











