ఆడవాళ్లకి ఒంపులుంటేనే సొంపుగా ఉంటుంది...?
విద్యాబాలన్ నటించిన క్రేజీ చిత్రం 'డర్టీ పిక్చర్'. సిల్క్‌స్మిత జీవిత కథ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో విద్యాబాలన్ సిల్క్‌గా నటించింది. ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు ముందు బోల్డన్ని వివాదాలు ఎదుర్కొంది. ఈ వివాదాలే ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. సినిమా విడుదలకు ముందు విద్యాబాలన్ని విమర్శించిన వారే ఇప్పుడు 'డర్టీపిక్చర్' సాధిస్తున్న వసూళ్లని చూసి ఆశ్చర్యపోతున్నారట. తొలి వారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్లు వసూలయ్యాయని బాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నారు. తను నటించిన చిత్రానికి అనూహ్య స్పందన లభిస్తున్న సందర్భంగా విద్యాబాలన్ మాట్లాడుతూ' 'డర్టీపిక్చర్' విడుదలకు ముందు అంతా నన్ను అంతా విమర్శించారు. ఇప్పుడు ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్స్‌ని చూసి నన్ను విమర్శించిన వారికి నా రేంజ్ ఏంటో అర్థమై వుంటుంది' అని తెలిపింది.
నిన్నమొన్నటి వరకు ఫ్యామిలీ హీరోయిన్ అని పిలిపించుకున్న విద్యాబాలన్ ఇప్పుడు డర్టీ హీరోయిన్ అనిపించుకుంటోంది. ఇలా తనని పిలుస్తున్నందుకు విద్య ఏమాత్రం సిగ్గు పడడం లేదు. తన నటించిన ఒక సినిమా ద్వారా ప్రేక్షకులు తనని గుర్తు పెట్టుకున్నారంటే తప్పకుండా అది తన గొప్పతనమేనని విద్య అంటోంది. డర్టీ పిక్చర్ లో అంత లావుగా ఉండడం ఎబ్బెంట్టు గా అనిపించలేదా అని అడిగినప్పుడు, బొద్దుగా ఉన్నా కాబట్టే తాను చేసిన అందాల ప్రదర్శన ఆకట్టుకుందని, ఒకవేళ జీరో సైజు ఫిజిక్ అంటూ కడుపు మాడ్చుకుని ఉంటే అప్పుడు చూపించడానికి, చూడడానికి ఏమీ ఉండదని తన డర్టీ సీక్రెట్ చెప్తోంది. ఆడవాళ్లకి ఒంపులుంటేనే సొంపుగా ఉంటుందని, సన్నగా తయారైతే మగాళ్లకీ, స్త్రీలకీ తేడా ఏముంటుందని డర్టీ జోకేస్తోంది.


Click it and Unblock the Notifications











