డర్టీ హీరోయిన్ విద్యాబాలన్ సెక్సీ డ్రెస్సులు వేలానికి..!?
ఈ సంవత్సరం బాగా వివాదాలు సృష్టించిన సినిమాల్లో 'ది డర్టీ పిక్చర్" ఒకటి. ఈ సినిమా సిల్క్ స్మిత జీవిత కథ మీద తీసారంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. మిలన్ లుథారియా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైంది. ఈ సినిమాని ఏక్తా కపూర్ నిర్మించారు. ఆ చిత్రంలో విద్యాబాలన్ స్మిత వేషాన్ని వేసారు. ఆమె వరకు చాలా బాగా చేసారని సినిమా చూసిన వారు చెబుతున్నారు. అయితే సిల్క్ స్మిత అంత రేంజ్ విద్యాబాలన్ కి లేదు అంటున్నారు. సినిమా చిత్రీకరిస్తున్నప్పుడే స్మిత సోదరుడు నాగవరప్రసాద్ కేసు వేయడంతో అప్పటికి చిత్రం షూటింగ్ చివరాఖరికి వచ్చినా ఒకింత మార్పులు చేర్పులు చేపట్టారు. ఏది ఏమైనా స్మిత జీవితాన్ని తెరకెక్కించడంలో ఏక్తాకపూర్ స్మితపై అభిమానంతో కాదు కేవలం కమర్షిలయ్ లుక్కుతో చేసారనిపిస్తుంది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన విద్యాబాలన్ కు చెందిన కొన్ని దుస్తులను వేలం వేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె ఈ సినిమాలో వాడిన బ్రా, బ్లౌజ్ ని వేలానికి ఉంచాలనుకుంటున్నారట. దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో కొన్ని సినిమాలకు చెందిన వస్తువులను వేలం వేసారు. ఇప్పుడు విద్యాబాలన్ వాడిన దుస్తులకు మంచి క్రేజ్ ఉంటుందని భావించే వేలం నిర్వహించాలని డిసైడ్ అయినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











